Advertisement

  • రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సీఎం కెసిఆర్ సమీక్ష

రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సీఎం కెసిఆర్ సమీక్ష

By: Sankar Mon, 17 Aug 2020 7:49 PM

రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సీఎం కెసిఆర్ సమీక్ష


తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయింది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. అనేక చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాల వారీగా సమాచారం తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు..

జిల్లాలవారిగా వర్షాభావ పరిస్థితులను కేసీఆర్ సమీక్షించారు. పంట, ఇతర నష్టాలపై వివరాలు పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉంది.

ఇక మరోవైపు సిద్దిపేట జిల్లాలో వరదల వల్ల జరిగిన మూడు సంఘటనలపై మంత్రి హరీశ్ రావు అధికారులను అప్రమత్తం చేశారు. చిన్నకోడూర్ మండలం దర్గాపల్లి వాగులో కొట్టుకుపోయిన కారు సంఘటనపై అధికారులను అలర్ట్‌ చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు కమిషనర్, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి వెంటనే రక్షణ చర్యలకు ఆదేశించారు. ప్రస్తుతం వాగులో కొట్టుకుపోయిన కారులో ఉన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ను కాపాడేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికారులందరు సంఘటనస్థలం వద్దే ఉండి, అన్ని చర్యలు తీసుకోవాలన్నారు

Tags :
|
|
|

Advertisement