Advertisement

  • ఇక నుంచి కాయిన్ వేస్తే బియ్యం వస్తాయి..కర్ణాటక ప్రభుత్వం విన్నూత్న ఆలోచన

ఇక నుంచి కాయిన్ వేస్తే బియ్యం వస్తాయి..కర్ణాటక ప్రభుత్వం విన్నూత్న ఆలోచన

By: Sankar Sat, 29 Aug 2020 09:55 AM

ఇక నుంచి కాయిన్ వేస్తే బియ్యం వస్తాయి..కర్ణాటక ప్రభుత్వం విన్నూత్న ఆలోచన


నగదు డ్రా చేసుకునే ఏటీఎం తరహాలో బియ్యం కోసం ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం బీపీఎల్‌ కార్డు కలిగిన వారికి ఉచితంగా, ఏపీఎల్‌ కార్డు కలిగిన వారికి నిర్ధిష్ట మొత్తంలో నగదు చెల్లించి బియ్యం, పప్పులు పొందే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. అయితే సరుకుల కోసం రేషన్‌ దుకాణాలు తెరిచే సమయానికి వెళ్లి గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికి చెక్‌ పెడుతూ ఏ సమయంలోనైనా బియ్యం తీసుకునేలా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ విధానం ప్రపంచంలోని ఇండోనేసియా, వియత్నాం దేశాల్లో మాత్రమే అమలులో ఉంది. కరోనా నేపథ్యంలో వినియోగదారులు క్యూలో నిల్చోకుండా ఈ విధానాన్ని ఆయా దేశాల్లో అమలు చేస్తున్నారు. దీన్ని కర్ణాటకలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కె.గోపాలయ్య కూడా ఇటీవల ధ్రువీకరించారు. ఏటీఎం రైస్‌ వ్యవస్థపై చర్చ సాగుతోందని, ఈ కార్యక్రమ సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

కాగా మన దేశంలో చాల శాతం పేదలే ఉండటంతో ప్రతి నెల వారు రేషన్ షాపుల ముందు రేషన్ కోసం లైన్ లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంధీ..చాల చోట్ల రేషన్ కోసం పడిగాపులు కాసిన సందర్భాలు కూడా ఉన్నాయి..అంతే కాకుండా రేషన్ డీలర్స్ అక్రమాలకు పాల్పడే అవకాశం కూడా ఉంది..అందుకే వీటన్నింటిని రూపుమాపేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ విన్నూత్న ఆలోచన చేసింది..

Tags :
|
|

Advertisement