Advertisement

ఇంటి నుంచే పరిపాలించనున్న కర్ణాటక సీఎం

By: Sankar Fri, 10 July 2020 5:31 PM

ఇంటి నుంచే పరిపాలించనున్న కర్ణాటక సీఎం



కర్ణాటకలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న దశలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు ..ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు బీఎస్‌ యడ్యూరప్ప తెలిపారు. శుక్రవారం కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించడానికి బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) మొత్తం 198 మంది కార్పొరేటర్లతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సమావేశం నిర్వహించాల్సి ఉంది.

అయితే ఆయన వద్ద పనిచేసే సిబ్బందిలో కొంత మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తాను ఇంటి నుంచి పని చేయనున్నట్లు యడ్యూరప్ప చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ముందు జాగ్రత్త కోసం ఇంటి నుంచి పనిచేస్తున్నానని తెలిపారు. ప్రజలెవరు భయమపడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆన్‌లైన్‌ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పారు.

ఈ విషయాని కంటే ముందు యడ్యూరప్ప రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కరోనా సెంటర్‌ కోసం బెంగుళూరులోని ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌లో 10,100 బెడ్‌లు ఏర్పాటు చేసినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రజలందరూ కరోనా గైడ్‌లైన్లకు ఫాలో అవుతూ కరోనా వ్యాప్తిని ఆరికట్టాలని యడ్యూరప్ప కోరారు. ఇదిలా వుండగా ఇప్పటి వరకు కర్ణాటకలో 30,000లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి..

Tags :
|
|
|

Advertisement