Advertisement

  • మహిళా కార్యకర్తతో రాసలీలలు ..కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై వేటు

మహిళా కార్యకర్తతో రాసలీలలు ..కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై వేటు

By: Sankar Fri, 02 Oct 2020 3:03 PM

మహిళా కార్యకర్తతో రాసలీలలు ..కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై వేటు


బీజేపీ కరీంనగర్‌ అధ్యక్షుడు బాస సత్యనారాయణపై అధిష్టానం వేటువేసింది. ఓ మహిళా కార్యకర్తలతో రాసలీలల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై ఈ మేరకు చర్య తీసుకున్నారు.

సత్యనారాయణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించారు. బాధ్యత గల పదవిలో ఉండి మహిళా కార్యకర్తలతో ఇలా వ్యవహరించడం పార్టీతో పాటు ఆయన వ్యక్తిత్వానికి సరైనది కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు.

కాగా బాస సత్యనారాయణ ఓ మహిళాతో అసభ్యకర రీతిలో మాట్లాడుతున్న ఓ ఆడియో ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక నేతలంతా అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంజయ్‌ ఆయన్ని పదవి నుంచి తొలగించారు

Tags :
|

Advertisement