Advertisement

  • సచిన్ ఆ కారణం వల్లనే టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేయలేకపోయాడు ..కపిల్ దేవ్

సచిన్ ఆ కారణం వల్లనే టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేయలేకపోయాడు ..కపిల్ దేవ్

By: Sankar Wed, 29 July 2020 5:06 PM

సచిన్ ఆ కారణం వల్లనే టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేయలేకపోయాడు ..కపిల్ దేవ్



భారత దిగ్గజ బాట్స్మన్ క్రికెట్ దేవుడు సచిన్ సాధించిన రికార్డులు అనేకం ...అత్యధిక సెంచరీలు , అత్యధిక పరుగులు , అత్యధిక మ్యాచ్ లు ఇలా సచిన్ కెరీర్లో ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి ..అయితే తన 24 ఏళ్ళ కెరీర్ లో మాత్రం సచిన్ ఒక్కసారి కూడా టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించలేకపోయారు ..కనీసం ట్రిపుల్ సెంచరీ దగ్గరకు కూడా వెళ్ళలేదు ..టెస్ట్ క్రికెట్ లో ఆరు డబల్ సెంచరీలు చేసిన సచిన్ అత్యధిక స్కోర్ 248 మాత్రమే..

అయితే సచిన్ కు సెంచరీలు డబల్ మరియు ట్రిపుల్ సెంచరీలుగా మలిచే టెక్నిక్ తెలియదు అని అన్నాడు దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ..టెస్టు ఫార్మాట్‌లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ మాట్లాడుతూ ‘‘ సచిన్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. నేను ఇప్పటి వరకూ ఎవరిలోనూ ఆ టాలెంట్ చూడలేదు. అతనికి సెంచరీలు ఎలా సాధించాలో..? బాగా తెలుసు. కానీ.. విధ్వంసక బ్యాట్స్‌మెన్‌గా మాత్రం ఎదగలేకపోయాడు.

క్రికెట్‌లోని చాలా ఘనతల్ని సాధిస్తూ మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదిన సచిన్‌కి.. వాటిని డబుల్, ట్రిఫుల్ సెంచరీలుగా ఎలా మలచాలో తెలియకపోయింది. ఒకవేళ ఆ టెక్నిక్ అతనికి తెలిసి ఉండింటే..? కచ్చితంగా మూడు ట్రిఫుల్ సెంచరీలు, మరో పది డబుల్ సెంచరీలు నమోదు చేసేవాడు. ఎందుకంటే.. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రతి ఓవర్‌లోనూ బౌండరీ కొట్టే సామర్థ్యం అతని సొంతం’’ అని కపిల్ కితాబిచ్చాడు.

Tags :
|

Advertisement