Advertisement

  • వికాస్ దూబే ఇంటిని కూల్చిన కాన్పూర్ అధికారులు

వికాస్ దూబే ఇంటిని కూల్చిన కాన్పూర్ అధికారులు

By: chandrasekar Mon, 06 July 2020 1:55 PM

వికాస్ దూబే ఇంటిని కూల్చిన కాన్పూర్ అధికారులు


కేవలం వికాస్ కి చెందిన ఆస్తులనే అధికారులు ధ్వంసం చేయాలని మున్సిపల్ అధికారులు కూల్చివేసినది తమ పూర్వీకుల ఇల్లు అని గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే తల్లి సరళా దేవి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హతమార్చిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను ఎన్‌కౌంటర్‌ చేసి చంపేయాలని అతడి తల్లి సరళా దేవి శుక్రవారం పోలీసులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇంతటి పాపానికి ఒడిగట్టిన తన కుమారుడిపై దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. వికాస్‌ దూబే ఎక్కడ కనిపిస్తే అక్కడే కాల్చిపారేయండి అని ఓ మీడియా చానల్‌తో ఆమె అన్నారు.

మరోవైపు బిక్రూ గ్రామంలోని వికాస్ దూబే ఇంటిని కాన్పూర్ అధికారులు శనివారం కూల్చివేశారు. దీనిపై అతడి తల్లి సరళా దేవి స్పందించారు. అది తమ పూర్వీకుల ఆస్తి అని, ఆ ఇంటిని తన మామ, భర్త నిర్మించినట్లు ఆమె చెప్పారు. అధికారులు కేవలం వికాస్‌కు చెందిన ఆస్తులనే ధ్వంసం చేయాలి కాని తమవి కాదని సరళా దేవి అన్నారు. బిక్రూ గ్రామంలోని తమ ఇంటిని అధికారులు కూల్చివేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గత నాలుగు నెలలుగా తాను తన భర్తను కలువలేదని, లక్నోలోని చిన్న కుమారుడి వద్ద ఉంటున్నట్లు సరళా దేవి చెప్పారు. వికాస్ వల్ల తాము, తమ బంధువులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే పోలీసులకు లొంగిపోవాలని తన కుమారుడు వికాస్ దూబేకు పిలుపునిచ్చారు.

Tags :
|

Advertisement