Advertisement

  • డ్రగ్స్ కేసులో సంబంధం వున్న కన్నడ యాంకర్ అనుశ్రీ

డ్రగ్స్ కేసులో సంబంధం వున్న కన్నడ యాంకర్ అనుశ్రీ

By: chandrasekar Sat, 26 Sept 2020 09:14 AM

డ్రగ్స్ కేసులో సంబంధం వున్న కన్నడ యాంకర్ అనుశ్రీ


సుశాంత్ సింగ్ మరణం తరువాత డ్రగ్స్ కేసు తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం కన్నడ యాంకర్ అనుశ్రీ కి దీనిలో సంబంధం ఉన్నట్లు తెలిసింది. కన్నడ సినీ పరిశ్రమ శాండిల్‌వుడ్ డ్రగ్స్ ప్రకంపనలతో వణికిపోతున్నది. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలు అరెస్ట్ అయ్యారు. మరి కొంతమంది టీవీ నటులు, డ్యాన్సర్లు, కొంతమంది డ్రగ్ సరఫరా చేసే వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు.

ఇప్పటికే చాలామంది కన్నడ సినీ ఇండస్ట్రీ లో పోలీసులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరు బయటకి రావడంతో ఇండస్ట్రీ అంతా భయపడుతుంది. తాజాగా డ్రగ్స్ రాకెట్‌లో ఫేమస్ కన్నడ యాంకర్ అనుశ్రీ పేరు బయటకురావడం, అనుశ్రీకి పోలీసులు నోటీసులు పంపడం కలకలం సృష్టిస్తున్నది. ఇటీవల డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్ శెట్టిని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసు విచారణలో వీరోతో పాటు ఇంకో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కిషోర్ శెట్టిని విచారించగా అనుశ్రీకి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు తెలిపాడు. అనుశ్రీ తో పాటు మరి కొంతమంది పేర్లను కూడా బయట పెట్టాడని సమాచారం. దీంతో ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. గతంలో పలు పార్టీల్లో అనుశ్రీ డ్రగ్స్ తీసుకుందని కిషోర్ చెప్పినట్లు తెలుస్తున్నది. ఊహించని విధంగా పాపులర్ యాంకర్ పేరు బయటకురావడంతో ఈ డ్రగ్స్‌ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :
|

Advertisement