Advertisement

రక్త పరీక్షకు రచ్చ రచ్చ చేసిన కన్నడ నటి సంజన

By: chandrasekar Sat, 12 Sept 2020 09:37 AM

రక్త పరీక్షకు రచ్చ రచ్చ చేసిన కన్నడ నటి సంజన


అనతి కాలంగా చిత్ర పరిశ్రమలో డ్రగ్ మాఫియా గురించి అలజడి రేపుతున్న విషయం అందరికి తెలిసిందే. డ్రగ్స్ మాఫియా కేసు లో పోలీసులు కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో నటి సంజన కూడా వున్నారు.

ఈ డ్రగ్ మాఫియా కేసులో బెంగుళూర్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు తాజాగా కేసు విచారణలో భాగంగా సంజనాకు రక్త పరీక్షలు చేయడానికి ప్రయత్ని స్తుండగా ఆమె నిరాకరించింది. ఆసుపత్రిలో రక్త నమూనా ఇవ్వడానికి సంజన రచ్చ రచ్చ చేసింది. ఆమె సృష్టించిన గందరగోళానికి పోలేసులు హడలి పోయారు.

డ్రగ్స్ కేసులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని, ప్రజలు, మీడియా ముందు నన్ను బకరాను చేసి ఆడుకుంటున్నారంటూ ఆమె ఆరోపించింది. నేను రక్తపరీక్షలు చేయించుకోను, రక్త పరీక్షలు చేసినా అది నా రక్తమే అనడానికి గ్యారెంటీ ఏమిటి ? నాకు ఎవ్వరిమీద నమ్మకం లేదు అంటూ సంజన తన గోడువెళ్లబోసుకున్నది.

ఇటీవల పోలీసులు నటి రాగిణి, సంజనా డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించారని పేర్కొన్నారు. నటి సంజనకు రక్తపరీక్షలు చెయ్యడానికి పోలీసులు ఆమెను ల్యాబ్ తీసుకెళ్లారు. ఆ సమయంలో రక్తపరీక్షలు చేయించుకోడానికి సంజనా మొండికేసి, నానా గొడవ చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Tags :

Advertisement