Advertisement

  • కాణిపాకంలో బ్రహ్మోత్సవ వైభవం - ప్రజాప్రతినిధుల సందడి

కాణిపాకంలో బ్రహ్మోత్సవ వైభవం - ప్రజాప్రతినిధుల సందడి

By: Dimple Sat, 22 Aug 2020 3:56 PM

కాణిపాకంలో బ్రహ్మోత్సవ వైభవం - ప్రజాప్రతినిధుల సందడి

మహిమగల దేవుడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి సన్నిధి బ్రహ్మోత్సవ వైభవం సంతరించుకుంది. వినాయక చవితి సందర్బంగా వరసిద్ది వినాయకుని సుగంధ పరిమళద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారి దివ్యసన్నిధి ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఉత్సవాల ప్రారంభ సందర్బంగా ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు పట్టువస్త్రాలను సమర్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు తరలిరావడంతో ప్రత్యేక సందడి నెలకొంది.

సత్య ప్రమాణాలకు ప్రసిద్ధిచెందిన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.నారాయణ స్వామి,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీనివాసులు,చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప ,పూతలపట్టు ఎమ్మెల్యే యం ఎస్ బాబు ,చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు,తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారాకనాథరెడ్డి,చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భారత్ గుప్త, చిత్తూరు జిల్లా ఎస్పీ సింధి ల్ కుమార్ లు శనివారం దర్శించుకున్నారు.స్వామి వారి సందర్శనార్థం విచ్చేసిన వీరికి ఆలయ సాంప్రదాయ ప్రకారం ఆలయ ఈఓ ఎ. వెంకటేశు, ఆలయ అర్చకులు,వేదపండితులు ఘనంగా పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి వారి సేవలో పాల్గొని స్వామి వారి ప్రత్యేక అభిషేకం ,పూజలు నిర్వహించారు. తరువాత వారికి మూషిక మండపంలో వేద పండితులచే అశ్వరచన చేసిన అనంతరం ఆలయ ఈఓ చేతుల మీదుగా స్వామి వారి శేష వస్త్రాలు,తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో చిత్తూరు వెస్ట్ సి ఐ లక్ష్మీకాంతరెడ్డి, కాణిపాకం యస్ ఐ మనోహర్,ఆలయ అసిస్టెంట్ కమీషనర్ కస్తూరి, ఏఈఓవోలు రవీంద్రబాబు,విద్యాసాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రజానికాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న కోవిడ్ ను నియంత్రించమని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కోరుకున్నట్లు దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు వర్షాలు సమృ ద్ధిగా కురవడంతో రైతన్న సుభిక్షంగా ఉన్నాడని... రాష్ట్రంలోని అన్ని డ్యాంలు లకు జలకళ సంతరించు కున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం తర పు న పట్టువస్త్రాలు సమర్పించే మహా భాగ్యాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యు లు కి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడిపే విధంగా స్వామి వారి ఆశీస్సులు అందాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆకాంక్షించారు... రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పేద ప్రజలకు అండ గా ఉంటున్న రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి వినాయక స్వా మి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

అన్న చిరంజీవికి తమ్ముడు పవన్‌ భావోద్వేగ శుభాకాంక్షలు

kanipakam,vinayaka,brahmotsavam ,కాణిపాకంలో బ్రహ్మోత్సవ వైభవం - ప్రజాప్రతినిధుల సందడి

మెగాస్టార్‌ చింరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ ఆత్మీయత, అనురాగం, అభిమానంతో కూడిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రమైక జీవనమే ప్రముఖ సినీ కథానాయకుడు చిరంజీవి విజయానికి సోపానమని ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా అవతరించారని కొనియాడారు. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ జనసేనాని ఓ భావోద్వేగ సందేశంతో ప్రకటనను విడుదల చేశారు.

అన్నయ్యే నా తొలి గురువు!
‘‘అన్నయ్య చిరంజీవి నా స్ఫూర్తి ప్రదాత. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో చిరంజీవిని అంతలా పూజ్యభావంతో ప్రేమిస్తాను. నా అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చేయిపట్టి పెరిగాను. ఒకవిధంగా చెప్పాలంటే అన్నయ్యే నా తొలి గురువు. అమ్మలా లాలించారు. నాన్నలా మార్గదర్శిగా నిలిచారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు అన్నయ్యను చూస్తే నిజమనిపిస్తాయి. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించారు. తెలుగు వారు సగర్వంగా ‘‘చిరంజీవి మావాడు’’ అని చెప్పుకొనేలా తనను తాను మలచుకున్నారు.


తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం
సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి, నాలాంటివారెందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. కష్టాన్ని నమ్ముకున్నారు. సముచిత స్థానానికి చేరుకున్నారు. చిన్న పాయగా ఉద్భవించే నది అఖండ రూపాన్ని సంతరించుకున్నట్టుగా అన్నయ్య ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అలవరచుకున్నారు. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవాతత్పరతను ఆవిష్కరింపజేసింది. ఆయనలా నటుడవుదామని, ఆయనలా అ భినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయనలా సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారు. తన అభిమానులకు సేవ అనే సత్కార్యానికి దారి చూపారు. ఎందరో ఆ దారిలో పయనిస్తూ నేడు సమాజంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆపన్నులకు అండగా ఉంటున్నారు. అటువంటి కృషీవలుడికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. నేడు చిరంజీవి జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను తెలుగువారందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆయనకు చిరాయువుతో కూడిన శుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అన్నయ్యకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

Tags :

Advertisement