Advertisement

  • ఆ సినిమా కోసం బరువు పెరగడం వలన నా వెన్ను దెబ్బతిన్నది..బాలీవుడ్ స్టార్ హీరోయిన్

ఆ సినిమా కోసం బరువు పెరగడం వలన నా వెన్ను దెబ్బతిన్నది..బాలీవుడ్ స్టార్ హీరోయిన్

By: Sankar Thu, 05 Nov 2020 7:58 PM

ఆ సినిమా కోసం బరువు పెరగడం వలన నా వెన్ను దెబ్బతిన్నది..బాలీవుడ్ స్టార్ హీరోయిన్


తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవిలో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్‌కు వచ్చేసింది.

అయితే ఈ మూవీకి ఒప్పుకున్న తరువాత కంగన చాలా కసరత్తులే చేశారు. ముఖ్యంగా అమ్మ పాత్రలో నటించడం కోసం కంగన బరువు కూడా పెరిగింది. అంతకుముందు కాస్త సన్నగా ఉండే కంగన.. ఈ మూవీ కోసం అధికంగా ఆహారం తీసుకోవడంతో పాటు హార్మోనీ పిల్స్ కూడా వాడి ఏకంగా 20కేజీల బరువును పెంచుకున్నారు.

అంత బరువు పెరిగాక భరత నాట్యం చేయడం వల్ల తన వెన్ను భాగం దెబ్బతిందని కంగన ట్వీట్ చేసింది. అనంతరం ఆ బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడ్డానని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. బరువు తగ్గేందుకు ఏడు నెలలకు పైగా సమయం పట్టిందని ట్వీట్ చేసింది కంగన

Tags :
|

Advertisement