Advertisement

  • మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా

By: Sankar Fri, 11 Sept 2020 07:27 AM

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా


ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్‌ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి గురువారం బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు. ‘ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్‌ ఠాక్రే స్థాపించారో, ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారు.

శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారు. నేను లేని సమయంలో బీఎంసీ గూండాలు నా ఇంటిని కూల్చేశారు’ అని ట్వీట్‌ చేశారు. బీఎంసీ అధికారులు బుధవారం కంగనా ఆఫీస్‌లో కొంత భాగాన్ని కూల్చివేసిన తరువాత, బొంబాయి హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. యజమాని లేని సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై వివరణ ఇవ్వాలని బీఎంసీని హైకోర్టు ఆదేశించింది.

కాగా తమిళ నటుడు విశాల్ కంగనా మీద ప్రశంసలంకురిపించాడు ..కంగనా... నీ గట్స్‌కి నా హ్యాట్సాఫ్‌. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలను వ్యక్తపరచడానికి నువ్వెప్పుడూ వెనకాడలేదు. నీకు సంబంధించిన విషయాలు కాకపోయినా వాటి గురించి నువ్వు మాట్లాడి, ప్రభుత్వం నుంచి కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నావు. అయినా ధైర్యంగా నిలబడ్డావు. నీ వైఖరి 1920లో భగత్‌సింగ్‌ను తలపించింది. తప్పు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎదురుగా ఎవరైనా మాట్లాడొచ్చు అని ఓ ఉదాహరణ చూపించావు" అంటూ విశాల్ కంగనను ప్రశంసించాడు.

Tags :
|

Advertisement