Advertisement

  • అభిషేక్ కూడా సుశాంత్ లాగ సూసైడ్ చేసుకుంటే మీరు తట్టుకుంటారా ..జయా బచ్చన్ ను ప్రశ్నించిన కంగనా

అభిషేక్ కూడా సుశాంత్ లాగ సూసైడ్ చేసుకుంటే మీరు తట్టుకుంటారా ..జయా బచ్చన్ ను ప్రశ్నించిన కంగనా

By: Sankar Tue, 15 Sept 2020 2:41 PM

అభిషేక్ కూడా సుశాంత్ లాగ సూసైడ్ చేసుకుంటే మీరు తట్టుకుంటారా ..జయా బచ్చన్ ను ప్రశ్నించిన కంగనా


బాలీవుడ్‌లో మొదలైన విమర్శల ప్రకంపనలు తాజాగా పార్లమెంట్‌ను తాకాయి. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌పై ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ విమర్శలు ఎక్కుపెట్టారు. రాజ్యసభలో జయా మంగళవారం చేసిన ప్రసంగంపై అభ్యంతరం చెబుతూ.. మీ కుమారుడు అభిషేక్‌ బచ్చక్‌ కూడా సుశాంత్‌లా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా అంటూ నిలదీశారు. ఈ మేరకు కంగనా ఓ ట్వీట్‌ చేశారు.

’రాజ్యసభలో జయాబచ్చన్‌ మాట్లాడిన తీరు సరైనది కాదు. నాకు మాదిరిగా మీ కుమార్తె స్వేతా బచ్చన్‌ కుడా టీనేజ్‌లో వేధింపులు గురైతే ఇలానే స్పందిస్తారా. కొందరు వ్యక్తుల మూలంగా మానసిక ఒత్తిడి గురై సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌లా మీ కుమారుడు అభిషేక్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా. మాపైన కాస్త జాలి చూపండి’ అని మండిపడ్డారు.

కాగా చిత్రపరిశ్రమపై ఎంపీలు రవికిషన్‌ మాట్లాడిన తీరుపై జయా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఉంటూ డ్రగ్స్‌ మాఫీయా అంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా జయా బచ్చన్‌ రాజ్యసభలో ప్రసంగిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై కౌంటర్‌గా కంగనా ట్వీట్‌ చేశారు

Tags :
|

Advertisement