Advertisement

  • ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో....చరిత్ర సృష్టించిన విలియమ్సన్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో....చరిత్ర సృష్టించిన విలియమ్సన్

By: Sankar Thu, 31 Dec 2020 12:52 PM

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో....చరిత్ర సృష్టించిన విలియమ్సన్


ఐసీసీ టెస్ట్ క్రికెట్ ర్యంకింగ్స్ లో కెన్ విలియమ్సన్ రికార్డు సృష్టించాడు ఇప్పటి వరకు ర్యాకింగ్స్ లో నెంబర్ వన్ అంటే స్మిత్ , లేదా కోహ్లీ ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని వెనక్కి నెట్టి విలియమ్సన్ నెంబర్ స్థానాన్ని ఆక్రమించాడు..అంతేకాదు న్యూజిలాండ్ టీమ్ కూడా చ‌రిత్ర సృష్టించింది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. విలియమ్సన్ నెంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడం ఇదే తొలిసారి...

2020 మొత్తం కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయ‌లేక‌పోయాడు. అటు స్మిత్ కూడా ఇండియాతో జ‌రిగిన రెండు టెస్టుల్లో ఒక్క‌సారి కూడా రెండంకెల స్కోరు అందుకోలేదు. ఇదే స‌మ‌యంలో విలియ‌మ్స‌న్ మాత్రం రెండు నెల‌లుగా చెలరేగి ఆడుతున్నాడు. వెస్టిండీస్‌పై డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. 251 ప‌రుగుల‌తో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించాడు.

ఈ మ‌ధ్యే పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో 23వ సెంచ‌రీ చేశాడు. 2020లో సొంత‌గ‌డ్డ‌పై కివీస్ వ‌రుస‌గా ఐదు టెస్టుల్లో గెలవ‌డం విశేషం. ఇండియా, వెస్టిండీస్‌ల‌పై సిరీస్‌లు క్లీన్‌స్వీప్ చేయ‌డ‌మే కాదు పాక్‌పైనా తొలి టెస్ట్ గెలిచింది. దీంతో టెస్టుల్లో తొలిసారి నంబ‌ర్ వ‌న్ స్థానానికి దూసుకెళ్లింది.

Tags :
|

Advertisement