Advertisement

  • కర్ణాటక కనకపుర నియోజకవర్గంలో స్వచ్చంధ లాక్ డౌన్

కర్ణాటక కనకపుర నియోజకవర్గంలో స్వచ్చంధ లాక్ డౌన్

By: Sankar Wed, 24 June 2020 6:58 PM

కర్ణాటక కనకపుర నియోజకవర్గంలో స్వచ్చంధ లాక్ డౌన్



దేశంలో కరోనా మహమ్మారి తగ్గకపోయినప్పటికీ ఆయా ప్రభుత్వాలు లాక్ డౌన్లలో సడలింపులు ఇచ్చి ప్రజలకు పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చాయి దీనితో ఇండియాలో తిరిగి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి ..దీనితో మళ్ళీ ప్రజలు వాళ్ళంతట వాళ్లే స్వచందంగా లాక్ డౌన్ విదించుకుంటున్నారు ..తాజాగా కర్ణాటకలో కరోనా కేసులు తీవ్రతరం కావడంతో కనకపుర నియోజకవర్గంలో జూన్ 1 వరకూ లాక్‌డౌన్ కొనసాగించనున్నారు.

ఈ మేరకు తన నియోజకవర్గం ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారని, దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని కర్ణాటక కాంగ్రెస్ నేత, కనకపుర ఎమ్మెల్యే డీకే శివకుమార్ తెలిపారు. తన అధ్యక్షతన కనకపుర మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. జూలై 1 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇలాంటి సమావేశమే మరొకటి ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా తీసుకున్న నిర్ణయం కాదు. స్వచ్ఛందంగానే మేము లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నాం' అని డీకే శివకుమార్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

పళ్లు, కూరగాయలు, మాంసం తదితర ఆహార వస్తువుల అమ్మకాలను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 11 వరకూ జరిపేందుకు వ్యాపారులు అంగీకరించారని, క్లినిక్‌లు, మందుల దుకాణాల వేళలపై జిల్లా అధికారులు, డీసీలు, ఎస్‌పీలు, ఆసుపత్రుల ప్రతినిధులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.స్వచ్ఛంద లాక్‌డౌన్ సమయంలో ప్రజలు అనవసర డ్రైవింగ్‌లకు దూరంగా ఉండాలని, సామాజిక దూరం పాటించడం తప్పని సరని, ఎవరి ఒత్తిడి ఎవరిపైనా ఉండదని కూడా ఆయన తెలియజేశారు.

Tags :

Advertisement