Advertisement

  • భార‌త సంత‌తీయుల‌కు ఇది చ‌రిత్రాత్మ‌కమైన రోజు ..కమలా హారిస్ ఉపాధ్యక్ష నామినేషన్ పై స్పందించిన మేనమామ

భార‌త సంత‌తీయుల‌కు ఇది చ‌రిత్రాత్మ‌కమైన రోజు ..కమలా హారిస్ ఉపాధ్యక్ష నామినేషన్ పై స్పందించిన మేనమామ

By: Sankar Wed, 12 Aug 2020 6:10 PM

భార‌త సంత‌తీయుల‌కు ఇది చ‌రిత్రాత్మ‌కమైన రోజు ..కమలా హారిస్ ఉపాధ్యక్ష నామినేషన్ పై స్పందించిన మేనమామ



అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా క‌మ‌లా హారిస్ పోటీలో నిలిచిన విష‌యం తెలిసిందే. అధ్య‌క్ష అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ పోటీలో నిలువ‌గా.. ఉపాధ్య‌క్షురాలిగా క‌మ‌లా హారిస్ పోటీ చేయ‌నున్నారు. క‌మలా హారిస్ మేమ‌మామ గోపాల‌న్ బాల‌చంద్ర‌న్ ఇండియాలో ఉన్నారు.

ఈ వార్త విన్న ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. కుటుంబం అంతా సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పారు. భార‌త సంత‌తీయుల‌కు ఇది చ‌రిత్రాత్మ‌కమైన రోజు అని గోపాల్ బాల‌చంద్ర‌న్ అన్నారు. 2009లో క‌మ‌లా హారిస్ త‌ల్లి మ‌ర‌ణించింద‌ని, ఆమె అస్థిక‌లు క‌లిపేందుకు క‌మ‌లా భార‌త్‌కు వ‌చ్చిన‌ట్లు గోపాలన్ గుర్తుచేశారు.

గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో అమెరికాలో ఉన్న‌ప్పుడు క‌మ‌లాతో మాట్లాడిన‌ట్లు గోపాలన్ తెలిపారు. క‌మ‌లాకు ఇవాళ కంగ్రాట్స్ మెసేజ్ చేసిన‌ట్లు తెలిపారు. సేనేట‌ర్ అయిన త‌ర్వాత క‌మ‌లా గ‌త రెండుమూడేళ్ల నుంచి ఇండియాకు స‌రిగా రావ‌డం లేద‌న్నారు. ఆమె భార‌తీయురాలు అని, కానీ ఇండియా ఏది చెబితే దాన్ని ఆమె స్వీక‌రించ‌లేదన్నారు.

ఆమెకు జ‌మైకాతోనూ లింకు ఉంద‌ని, ఆఫ్రిక‌న్ అమెరిక‌న్ అని, త‌న స్వంత నిర్ణ‌యం ప్ర‌కార‌మే ముందుకు వెళ్తుంద‌ని గోపాల‌న్ చెప్పారు. ఒక‌వేళ ఇండియా లేదా ఇత‌ర దేశాల్లో ఏదైనా ఎంపిక చేసుకోమంటే, ఆమె నిర్మోహ‌మాటంగా భార‌త్‌ను కోరుకుంటుంద‌న్నారు. అమెరికా రాజ్యాంగం ప్ర‌కారం క‌మ‌లా హారిస్ ప్ర‌మాణం చేసినా.. భార‌త్‌ను ఇష్ట‌ప‌డుతుంద‌న్నారు

కాగా అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడ్తున్న తొలి భారతీయ సంతతి మహిళగా కమలా హారిస్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే..అయితే ఆమె అభ్యర్థిత్వంపై ప్రత్యర్థి పార్టీ అధ్యక్ష అభ్యర్థి , ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెదవి విరిచాడు ..ఒక భయంకరమైన లేడీ అయిన హారిస్ ను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని తాను అనుకోలేదు అని ట్రంప్ అన్నాడు ..

Tags :
|

Advertisement