Advertisement

  • నూతన పార్లమెంట్ భవన నిర్మాణంపై ప్రధాని మోడీకి ప్రశంలు సంధించిన కమల్ హాసన్

నూతన పార్లమెంట్ భవన నిర్మాణంపై ప్రధాని మోడీకి ప్రశంలు సంధించిన కమల్ హాసన్

By: Sankar Sun, 13 Dec 2020 6:21 PM

నూతన పార్లమెంట్ భవన నిర్మాణంపై ప్రధాని మోడీకి ప్రశంలు సంధించిన కమల్ హాసన్


ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని మోడీ పునాది రాయి వేసిన విషయం తెలిసిందే..పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు సభలలో సభ్యులు కూడా పెరుగుతుండటంతో అందరికి అనువుగా ఉండేవిధంగా భారీగా దీనిని నిర్మిస్తున్నారు...అయితే ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పై విమర్శలు గుప్పించాడు హీరో కమల్ హాసన్..

దేశంలోని సగం జనాభా తిండీతిప్పలు లేకుండా అల్లాడుతుంటే ఈ సమయంలో కొత్తగా మరో పార్లమెంట్‌ భవనం అవసరమా అని సూటిగా ప్రశ్నించారు. కరోనా కాటుతో దేశ ఆర్థిక రంగం కుదేలైన వేళ ఇంతా భారీ వ్యయమెందుకని ఎద్దేవా చేశారు. వచ్చే ఏడు జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్న కమల్‌ ఈ మేరకు మోదీపై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

దేశంలోని సంగం మందికి తిండి లభించడం లేదు. కరోనా వైరస్‌ కారణంగా అందరి జీవితాలు ప్రభావితమయ్యాయి. మీరేమో రూ.1000 కోట్లతో కొత్త పార్లమెంట్‌ నిర్మాణానికి రూపకల్పన చేశారు. గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనా నిర్మించే క్రమలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు విడిస్తే.. ప్రజల్ని రక్షించేందుకు ఆ భారీ నిర్మాణం చేపట్టామని పాలకులు సెలవిచ్చారట. మీ ధోరణి కూడా అలాగే ఉంది. ఎవరిని రక్షించేందుకు మీరు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. దయచేసి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ప్రధాన మంత్రి మోదీ గారు’అని కమల్‌ సూటిగా ప్రశ్నించారు

Tags :

Advertisement