Advertisement

ఓటర్ కార్డు అనేది ఒక పెద్ద ఆయుధం ...కమల్ హాసన్

By: Sankar Fri, 20 Nov 2020 7:49 PM

ఓటర్ కార్డు అనేది ఒక పెద్ద ఆయుధం ...కమల్ హాసన్


మరో ఆరు నెలల్లో తమిళనాడులో ఎన్నికల నగారా మోగనుంది. పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగనున్న నటుడు, మక్కల్‌ నీధి మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఓటర్లును ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

ఓటరు ఐడీ మన చేతిలోని బ్రహ్మాస్త్రం అన్నారు. అర్హులైన వారంతా ఓటరు ఐడీలకోసం సైన్‌ అప్‌ చేసుకోవాలని కోరారు. రెండున్నర నిమిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కమల్‌ ప్రజలను ఉద్దేశిస్తూ.. ‘ఓటరుగా ఉండటం అనేది 18 ఏళ్లు నిండిన వారికి దక్కిన అరుదైన గౌరవం. ఓటరు ఐడి అనేది పెద్ద ఆయుధం.

తన బాధ్యతలను సరిగా నిర్వర్తించని సమాజం.. హక్కులను ఆటోమెటిక్‌గా కోల్పోతుంది. మార్పు రావాలని ఉపన్యాసాలు దంచేవారు.. సిస్టం సరిగ్గా పని చేయడం లేదని విమర్శించే వారు.. ప్రజా ప్రతినిధులంతా దొంగలు అని తిట్టే వారికి ఓటరు ఐడీ ఉండదు. 2021 ఎన్నికల్లో దీన్ని మీ ఆయుధంగా వాడుకోండి. నేను మారతాను.. నేను ఓటేస్తాను అని ప్రతిజ్ఞ చేయండి’ అని కోరారు కమల్‌

Tags :

Advertisement