Advertisement

  • రైతులు చేస్తున్న ఆందోళ‌నలపై స్పందించిన క‌మ‌ల్ హాస‌న్...రైతులు డిమాండ్ల‌ను వినాలి...

రైతులు చేస్తున్న ఆందోళ‌నలపై స్పందించిన క‌మ‌ల్ హాస‌న్...రైతులు డిమాండ్ల‌ను వినాలి...

By: chandrasekar Tue, 01 Dec 2020 8:16 PM

రైతులు చేస్తున్న ఆందోళ‌నలపై స్పందించిన క‌మ‌ల్ హాస‌న్...రైతులు డిమాండ్ల‌ను వినాలి...


ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళ‌నలపై మ‌క్క‌ల్ నీధి మ‌యిం అధ్య‌క్షుడు, నటుడు క‌మ‌ల్ హాస‌న్ స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వం రైతులు డిమాండ్ల‌ను వినాలని కమల్ హాసన్ సూచించారు. వారి డిమాండ్లను పట్టించుకోవాలని కేంద్రానికి ఆయన విన్నవించారు. ఈ మేరకు కమల్ హాసన్ మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త‌మిళ‌నాడులో సీఎం పరిపాల‌న ప‌ట్ల సంతృప్తి లేద‌ని తెలిపారు. నివ‌ర్ తుఫాన్ బాధితుల‌కు స‌హాయం చేయడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని కమల్ హాసన్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును ఆయ‌న ఖండించారు. ఈ సమావేశంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ సంతోష్ బాబు మ‌క్క‌ల్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన్ను కమల్ మక్కల్ నీధి మయం పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :
|

Advertisement