Advertisement

ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన కమల్ హాసన్

By: Sankar Tue, 15 Dec 2020 6:19 PM

ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన కమల్ హాసన్


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి...సూపర్ స్టార్ రజినీకాంత్ బరిలోకి దిగతుండటంతో ఈ సారి ఎన్నికలు ఇంకా రసవత్తరంగా మారే అవకాశం ఉంది..సినిమాలలో తలపడినట్లే ఈ సారి ఎన్నికల్లో కూడా ఒకవైపు రజినీకాంత్ , మరోవైపు లోక నాయకుడు కమల్ హాసన్ తలపడనున్నారు..

ఇక కమల్‌హాసన్‌ తన పార్టీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను సోమవారం మధురైలో లాంచ్‌ చేశారు. ఈ క్రమంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని.. అయితే ఏ నియోజకవర్గం నుంచి దిగుతాననే విషయాన్ని త్వరలో ప్రకటిస్తానని అన్నారు...

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఏర్పాటు చేయబోయే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘పొత్తులు కొన్ని సార్లు విడిపోతాయి. మరికొన్ని సార్లు కొత్తవి పుట్టుకువస్తాయి. ప్రస్తుతానికి రజనీకాంత్‌ పార్టీతో పొత్తు విషయం గురించి నిర్ణయం తీసుకోలేదని’ అన్నారు.

Tags :

Advertisement