Advertisement

  • మేము అధికారంలోకి వస్తే గృహిణులకు ప్రత్యేక జీతాలు ఇస్తాము ...మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్

మేము అధికారంలోకి వస్తే గృహిణులకు ప్రత్యేక జీతాలు ఇస్తాము ...మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్

By: Sankar Wed, 23 Dec 2020 11:48 AM

మేము అధికారంలోకి వస్తే గృహిణులకు ప్రత్యేక జీతాలు ఇస్తాము ...మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్


రాజకీయల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు సినీ నటుడు , మక్కల్‌ నీది మయం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్...

మంగళవారం తిరువణ్ణామలై జిల్లాలో కమల్‌హాసన్‌ ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నాలుగు ప్రాంతాల్లో ప్రజలను ఆయన సందర్శించారు. ప్రజలకు అభివాదం మాత్రం చేస్తూ ఎటువంటి ప్రచారం చేయకుండా వెళ్లారు. అనంతరం ప్రయివేటు కల్యాణ మండపంలో ఆయన అభిమానులు, కార్యకర్తలతో చర్చించారు.

మక్కల్‌ నీది మయం అధికారానికి వచ్చిన వెంటనే సెయ్యారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని, నిరుపేదలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో అధికంగా గ్రామీణ కళాకారులున్నారని, వారి కష్టాలు తనకు తెలుసునన్నారు. అధికారంలోకి వస్తే కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని ప్రకటించారు

Tags :

Advertisement