Advertisement

  • ఇక నుంచి నన్ను మై లార్డ్ అని కాకుండా సర్ అని పిలవండి ..కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్య

ఇక నుంచి నన్ను మై లార్డ్ అని కాకుండా సర్ అని పిలవండి ..కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్య

By: Sankar Fri, 17 July 2020 10:00 AM

ఇక నుంచి నన్ను మై లార్డ్ అని కాకుండా సర్ అని పిలవండి ..కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్య



కోర్ట్ లో లాయర్లు ఏదయినా వాదించేప్పుడు మై లార్డ్ అనడం మనం తరుచుగా చూస్తూనే ఉంటాము ..మై లార్డ్ అనో , లార్డ్ షిప్ అనో పిలుస్తుంటారు ..అసలు ఈ మై లార్డ్ అనే పదం బ్రిటిష్ వాళ్ళు మనలని పరిపాలించినప్పుడు ప్రారంభం అయింది..సాధారణంగా న్యాయమూర్తుల మీద ఉన్న గౌరవంతో లాయర్లు కోర్ట్ లో ఇలా మై లార్డ్ అని సంబోధిస్తారు ..

అయితే ఇప్పటి వరకు ఆచరణలో ఉన్న ‘మైలార్డ్‌’, ‘లార్డ్‌షిప్‌’ లాంటి సంబోధన తగదని, తనను ‘సర్‌’ అని మాత్రమే పిలిస్తే సరిపోతుందని కలకత్తా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ టీబీఎన్‌ రాధాక్రిష్ణన్‌ వ్యాఖ్యానించారు. బెంగాల్, అండమాన్‌లలోని న్యాయాధికారులందరూ తనను ‘సర్‌’ అనే సంబోధించాలని ఆయన సూచించారు.

ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాయ్‌ చటోపాధ్యాయ.. బెంగాల్, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ఐలాండ్స్‌లోని జిల్లా జడ్జీలకు, కింది కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు చీఫ్‌ జస్టిస్‌ చేసిన సూచనలను పంపారు. ఇకపై జిల్లా న్యాయాధికారులు, హైకోర్టులోని రిజిస్ట్రీ సిబ్బంది తనను ‘సర్‌’అని సంభోదించాలని చీఫ్‌ జస్టిస్‌ ఆకాంక్షించారు

Tags :
|

Advertisement