Advertisement

  • జ‌గ‌ద్గిరిగుట్ట‌లో క‌ల‌క‌లం...ఆటోలో భారీ పేలుడు

జ‌గ‌ద్గిరిగుట్ట‌లో క‌ల‌క‌లం...ఆటోలో భారీ పేలుడు

By: chandrasekar Sat, 24 Oct 2020 5:16 PM

జ‌గ‌ద్గిరిగుట్ట‌లో క‌ల‌క‌లం...ఆటోలో భారీ పేలుడు


జ‌గ‌ద్గిరిగుట్ట‌లో ఆస్బెస్టాస్ కాల‌నీలో శ‌నివారం ఉద‌యం భారీ పేలుడు క‌ల‌క‌లం రేపింది. ఆటోలో ఒక్క‌సారిగా పేలుడు సంభ‌వించ‌డంతో స్థానికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. జ‌గ‌ద్గిరిగుట్ట ప‌రిధిలోని ఆస్బెస్టాస్ కాల‌నీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఆగి ఉన్న ఆటోలో పేలుడు జ‌రిగింద‌ని, ఆ స‌మ‌యంలో ఆటోలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పిందని పోలీసులు చెప్పారు. అయితే ఆటో డ్రైవ‌ర్ యూస‌ఫ్ అలీకి ఈ ప్ర‌మాదంలో తీవ్ర గాయాల‌య్యాయ‌ని తెలిపారు. గాయ‌ప‌డిన యూస‌ఫ్ అలీని పోలీసులు స్థానికుల సాయంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అనంత‌రం పోలీసులు క్లూస్ టీమ్‌ను ర‌ప్పించి ఘ‌ట‌నా స్థ‌లంలో ఆధారాల‌ను సేక‌రించారు. కేసు న‌మోదు చేసి పేలుడుకుగ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ పేలుడులో ఆటో పూర్తిగా కాలిపోయింది.

Tags :
|

Advertisement