Advertisement

  • కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా కాజల్ తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసిందట

కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా కాజల్ తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసిందట

By: chandrasekar Wed, 23 Sept 2020 10:26 AM

కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా కాజల్ తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసిందట


కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా కాజల్ తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసిందని తెలుస్తుంది. టాలీవుడ్ ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ పెళ్లి వాయిదా పడ్డట్లు వార్తలు వచ్చాయి. కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి గత సంవత్సరం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావన రాగా 2020లో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అప్పటి నుంచి కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి మీడియాలో అనేక వార్తలొచ్చాయి. కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్‌కి 2013లోనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి అయిన విషయం తెలిసిందే. 2018లో నిషాకి బాబు కూడా పుట్టాడు. కానీ కాజల్ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదని, ఇంకా ఎప్పుడూ పెళ్లి చేసుకుంటావు అని కాజల్ తల్లిదండ్రులు కాజల్‌ని ఒత్తిడి చేస్తున్నారనే టాక్ వినిపించింది. అందుకే ఇంటా, బయట పెళ్లి పోరు పడలేని కాజల్ అగర్వాల్ 2020లో పెళ్లి చేసుకుంటానని గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పెళ్లి అనేది ఒక గొప్ప వేడుక అని అభిప్రాయపడిన కాజల్ 2020లో ఘనంగా తన పెళ్లి వేడుక చేసుకోనున్నట్టు వెల్లడించింది.

ఈ భామకు చాలా రోజులుగా పెళ్లి కానీ విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తల్లిదండ్రులు ఆమె కోసం సంబంధాలు చూస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అలాగే ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తతో కాజల్ ఎంగేజ్మెంట్ చేసుకుంది అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన ప్రణాళికలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ల కారణంగా కాజల్ తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కాజల్ అగర్వాల్, కమల్ హాసన్ సరసన ‘భారతీయుడు 2’ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా భారతీయుడు 2 షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రంలో చాలా భాగం షూటింగ్ పూర్తయింది. కరోనా కారణంగా మిగితా షూటింగ్ ఆగిపోయింది. కాజల్ 'భారతీయుడు 2' సినిమాతో పాటు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్‌ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలను పూర్తి చేయడమే కాజల్ ప్రాధాన్యత అని తెలుస్తోంది. అందుకే తన పెళ్లిని వచ్చే ఏడాదికి ప్లాన్ చేసినట్టు టాక్. ఆమె అభిమానులంతా ఆమె పెళ్లి గురించి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Tags :
|

Advertisement