Advertisement

  • నాకు ఆస్థానంలో బ్యాటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ..కె ఎల్ రాహుల్

నాకు ఆస్థానంలో బ్యాటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ..కె ఎల్ రాహుల్

By: Sankar Wed, 26 Aug 2020 8:34 PM

నాకు ఆస్థానంలో బ్యాటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ..కె ఎల్ రాహుల్


టీం ఇండియా యువ ఆటగాడు కె ఎల్ రాహుల్ టి ట్వంటీ క్రికెట్ లో తనకు ఓపెనర్ గా ఆడటమే ఇష్టం అని అన్నాడు..ఇలా అయితే మొత్తం 20 ఓవర్లు క్రీజులో ఉండి ఎక్కువ పరుగులు సాధించవచ్చని రాహుల్ తెలిపాడు..అయితే రోహిత్ , ధావన్ లా రూపంలో ఇద్దరు స్టార్ ఓపెనర్లు జట్టులో ఉండటంతో రాహుల్ కు ఓపెనర్ గా ఆడటానికి ఎక్కువగా అవకాశం రావడం లేదు..అందుకే ఎక్కువగా నాలుగు లేదా , వన్ డౌన్ లో ఆడుతున్నాడు ..

రాహుల్ మాట్లాడుతూ టీ20ల్లో మాత్రం ఓపెనింగ్‌ బ్యాటింగ్‌కే తన మద్దతు అని తెలిపాడు. ‘ఓపెనర్‌గా క్రీజులోకి రావడాన్ని ఎంతో ఆస్వాదిస్తా. దీనివల్ల 20 ఓవర్లూ బ్యాటింగ్‌ చేయవచ్చు. ఆఖరి వరకు క్రీజులో ఉంటే ఎక్కువ స్కోరు చేయగలను. గత రెండు సీజన్లలో పంజాబ్‌ తరపున మంచి ప్రదర్శన ఇచ్చాను. జట్టుకు మరిన్ని విజయాలు చేకూర్చే విధంగా ప్రయత్నిస్తా’అని రాహుల్‌ అన్నాడు..

ఐపీయల్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ గా ఉన్న రాహుల్ , ఈ సారి ఎలాగా అయినా పంజాబ్ రాత మార్చాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు..కాగా సెప్టెంబర్‌ 19నుంచి యూఏఈలో ఐపీఎల్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి

Tags :

Advertisement