Advertisement

  • గేల్ చెప్పి మరీ సిక్సర్లు బాదాడు ..కె యల్ రాహుల్

గేల్ చెప్పి మరీ సిక్సర్లు బాదాడు ..కె యల్ రాహుల్

By: Sankar Wed, 24 June 2020 7:58 PM

గేల్ చెప్పి మరీ సిక్సర్లు బాదాడు ..కె యల్ రాహుల్



కరోనా నేపథ్యంలో ఎటువంటి క్రికెట్ టోర్నీలు కాదు కదా కనీసం ప్రాక్టీస్ సెషన్స్ కూడా లేకపోవడంతో క్రికెటర్లకు ఎం చేయాలో అర్థంకావడం లేదు ..క్రికెటర్ల కెరీర్లలో ఇంత ఖాళి ఎప్పుడు చూసి ఉండరు అందుకే దొరికిన ఈ సమయాన్ని సోషల్ మీడియాలో బాగా వాడుకుంటున్నారు ..అయితే ఇండియన్ టెస్ట్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌ పేరుతో చాట్‌షో నిర్వహిస్తున్నాడు. వరుస చాట్ షోలతో క్రికెటర్లను ఇంటర్య్వూ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. తాజగా మయాంక్‌ ఐపీఎల్‌లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ సహచర ఆటగాళ్లైన కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌తో చాట్ షో నిర్వహించాడు. చాట్‌ సందర్భంగా రాహుల్‌, గేల్‌లు ఐపీఎల్‌ బెస్ట్‌ మూమెంట్స్‌ను షేర్‌ చేసుకున్నారు.

రాహుల్‌ స్పందిస్తూ.. '2018 ఐపీఎల్‌లో నేను కింగ్స్‌ లెవెన్‌కు ఆడుతున్న సమయంలో క్రిస్‌ గేల్‌ కూడా జట్టులో ఉన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ విధ్వంసం ఇంకా నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. నాకు బాగా గుర్తు.. ఆరోజు గేల్‌ మంచి ఆకలి మీద ఉన్నాడు. ఆ సీజన్‌లోనే అత్యధిక పరుగులు చేయాలనే ఉత్సాహంతో ఆడుతున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.

అప్పటికే కోపంతో ఊగిపోతున్న గేల్‌ ఈ సమయంలో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌కు వస్తే అతని అంతు చూస్తా అని పేర్కొన్నాడు. ఎందుకంటే నాకు స్పిన్నర్‌ బౌలింగ్‌ రావడం ఇష్టం లేదని.. నా ముందు ఆధిపత్యం చలాయిస్తే చూస్తూ ఊరుకోనని తెలిపాడు. 14 ఓవర్‌ వేసిన రషీద్‌ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్స్‌లు కొట్టి గేల్‌ తన మాటను నిలబెట్టుకున్నాడు. నేను చూసిన మూమెంట్స్‌లో దీనినే ది బెస్ట్‌ అంటా' అని కేఎల్‌ రాహుల్‌ చెప్పుకొచ్చాడు.


Tags :
|
|

Advertisement