Advertisement

  • ఒక్క ఇన్నింగ్స్ తో అనేక రికార్డులు బద్దలు కొట్టిన కె ఎల్ రాహుల్..

ఒక్క ఇన్నింగ్స్ తో అనేక రికార్డులు బద్దలు కొట్టిన కె ఎల్ రాహుల్..

By: Sankar Fri, 25 Sept 2020 12:54 PM

ఒక్క ఇన్నింగ్స్ తో అనేక రికార్డులు బద్దలు కొట్టిన కె ఎల్ రాహుల్..


యూఏఈ లో జరుగుతున్న ఐపీయల్ పదమూడవ సీజన్ మెల్ల మెల్లగా ఊపుఅందుకుంటుంది.ఒకవైపు కరోనా భయం , మరోవైపు ప్రేక్షకులు లేరు దీనితో ఐపీయల్ ఎలా జరుగుతుందో అన్న వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ మ్యాచ్ మ్యాచ్ కు అభిమానుల్లో ఆనందాన్ని పెంచుకుంటూ పోతుంది..తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ , ఆర్సీబి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్స్ కెప్టెన్ రాహుల్ చెలరేగిపోయి ఈ సీజన్ తొలి సెంచరీ సాధించాడు..

మొత్తం 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో ఈ మ్యాచ్ లో 132 పరుగులు సాధించి ఈ ఐపీఎల్ 2020 లో మొదటి సెంచరీ నమోదు చేయడం మాత్రమే కాకుండా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అలాగే ఈ ఒక్క మ్యాచ్ లోనే చాలా రికార్డులకు కూడా రాహుల్ బ్రేక్ చేసాడు. ఈ ఐపీఎల్ సీజన్ లోనే మొదటిసారిగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాహుల్ కు ఇది కేవలం రెండో మ్యాచ్. అయిన కూడా ఐపీఎల్ కెప్టెన్ లలో అరుదైన ఘనత సాధించాడు. అదేంటంటే... ఇప్పటివరకు ఐపీఎల్ లో రాహుల్ చేసిన 132 పరుగులే ఓ కెప్టెన్ సాధించిన అత్యధిక పరుగులు. అలాగే ఓ భారత క్రికెటర్ ఐపీఎల్ లో బాదిన అత్యధిక పరుగులు కూడా ఇవే.

అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ రికార్డు ఇంతకముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరు మీద ఉంది. వార్నర్ 2017 లో కేకేఆర్ పైన 59 బంతుల్లో 126 పరులు చేసాడు. ఇక ఓ భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇంతకముందు మురళి విజయ్ పేరు మీద ఉంది. రాజస్థాన్ రాయల్స్ కు వ్యతిరేకంగా 2010 లో విజయ్ 127 పరుగులు సాధించాడు. కానీ ఇప్పుడు ఈ రెండు రికార్డులు కేఎల్ రాహుల్ సొంతం అయ్యాయి.

Tags :
|

Advertisement