Advertisement

  • ఆ ముగ్గురు ఎలా చేసారో వారినే ఫాలో అవుతాను ..కె ఎల్ రాహుల్

ఆ ముగ్గురు ఎలా చేసారో వారినే ఫాలో అవుతాను ..కె ఎల్ రాహుల్

By: Sankar Thu, 03 Sept 2020 10:48 AM

ఆ ముగ్గురు ఎలా చేసారో వారినే ఫాలో అవుతాను ..కె ఎల్ రాహుల్


ఐపీయల్ లో ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లలో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఒకటి..ఇప్పటికి అనేక మంది కెప్టెన్సీలో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు విజయం మాత్రం అందని ద్రాక్షే అయింది..అయితే ఈ సారి ప్రతిభావంతుడు అయినా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో , లెజెండరీ ఆటగాడు కుంబ్లే కోచింగ్లో నూతన ఉత్సహంతో బరిలోకి దిగుతున్న కింగ్స్ లెవెన్ జట్టు ఈ సరి ఎలాగా అయిన టైటిల్ కొట్టాలని దృఢ నిశ్చయంతో ఉంది..

ఇక కెప్టెన్సీ పై రాహుల్ మాట్లాడుతూ... నేను ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల న్యాయకత్వం లో ఆడాను. కాబట్టి వారి నుండి నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు ఉపయోగిస్తాను అని తెలిపాడు. అలాగే ఇటువంటి సమయంలో కుంబ్లే వంటి కోచ్ నాతో ఉండటంతో ఆనదంగా ఉంది అన్నాడు. ఆటగాళ్లను ముందుండి నడిపించడం మరియు జట్టును లక్ష్యాల వైపుకు నెట్టడం వంటివి నేను మా కెప్టెన్ల వద్ద నుండి నేర్చుకున్నాను.

ధోని, కోహ్లీ వ్యక్తిగతంగా వేరు కానీ కెప్టెన్సీ విషయంలో ఇద్దరు ఒకేలా ఉంటారు. అలాగే రోహిత్ ఎలాంటి కెప్టెన్ అనేది అందరికి తెలుసు. ఇక కేన్ విలియమ్సన్ వంటి కెప్టెన్ నుండి కూడా నేర్చుకోవటానికి చాలా ఉంది అని రాహుల్ చెప్పాడు.ఇక సెప్టెంబర్ 19 నుంచి ఐపీయల్ పదమూడవ సీజన్ ప్రారంభం అవనున్న విషయం తెలిసిందే

Tags :
|

Advertisement