Advertisement

  • వ్యక్తిగత సమాచారాన్ని అందులో పోస్ట్ చేయకండి..ఎన్టీఆర్ విజ్ఞప్తి

వ్యక్తిగత సమాచారాన్ని అందులో పోస్ట్ చేయకండి..ఎన్టీఆర్ విజ్ఞప్తి

By: Sankar Fri, 09 Oct 2020 11:49 AM

వ్యక్తిగత సమాచారాన్ని అందులో పోస్ట్ చేయకండి..ఎన్టీఆర్ విజ్ఞప్తి


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. యువత ఇంటర్ నెట్ లోనే దాదాపు 15 నుంచి 16 గంటల వరకు గడుపుతున్నారు. దాంతో సైబర్ నేరగాళ్లు కూడా ఇదే అవకాశంగా మోసాలకు పూనుకుంటున్నారు.

మహిళలు ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మానసిక వేదనకు లోనుకావడంతో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండలని హైదరాబాద్‌ నగర పోలీసులు తాజాగా ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. జాగ్రత్త!'' అంటూ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు

Tags :
|
|

Advertisement