Advertisement

  • ధోని అనగానే ఆ సిక్స్ ఎప్పుడు నా మదిలో మెదులుతుంది..జోస్ బట్లర్

ధోని అనగానే ఆ సిక్స్ ఎప్పుడు నా మదిలో మెదులుతుంది..జోస్ బట్లర్

By: Sankar Sun, 01 Nov 2020 9:14 PM

ధోని అనగానే ఆ సిక్స్ ఎప్పుడు నా మదిలో మెదులుతుంది..జోస్ బట్లర్


ప్రపంచ క్రికెట్ లో ఎన్నో ఘనతలు సాధించిన ఇండియన్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని అనగానే చాలా మందికి 2011 ప్రపంచ కప్ ఫైనల్లో కొట్టిన విన్నింగ్ షాట్ కళ్ళ ముందు మెదులుతుంది.. నువాన్ కులశేఖర బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన ధోనీ భారత్‌కు వరల్డ్ కప్ అందించిన తీరును ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ ఆ విన్నింగ్ షాట్ చూసి మురిసిపోతుంటారు

తాజాగా 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ ఆటకు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ కూడా ఫిదా అయిపోయాడు. ‘మైదానంలో ధోనీ ప్రవర్తించే తీరు నాకెంతో ఇష్టం. అతడెంతో కూల్‌గా ప్రశాంతంగా ఉంటాడు. అతడు ఆడే హెలికాప్టర్ షాట్, విధ్వంసకర బ్యాటింగ్ అంతే నాకెంతో ఇష్టం.

నేనెప్పుడూ ఐపీఎల్ టీవీలో చేసేవాడిని. ధోనీ ఆడిన కొన్ని గొప్ప ఇన్నింగ్స్ నాకు గుర్తున్నాయి. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో అతడు ఆడిన తీరు నాకెంతో నచ్చుతుంది. సిక్స్‌తో అతడు మ్యాచ్ ముగించిన తీరు స్ఫూర్తినిస్తుంది. అదెప్పుడూ నా మదిలో మెదులుతుంది’’ అని బట్లర్ తెలిపాడు.

Tags :

Advertisement