Advertisement

  • ఈ సారి కోహ్లీతో మాటల యుద్దానికి దిగము ..జోష్ హాజెల్‌వుడ్‌

ఈ సారి కోహ్లీతో మాటల యుద్దానికి దిగము ..జోష్ హాజెల్‌వుడ్‌

By: Sankar Sun, 05 July 2020 10:41 AM

ఈ సారి కోహ్లీతో మాటల యుద్దానికి దిగము ..జోష్ హాజెల్‌వుడ్‌



ఆస్ట్రేలియా తో క్రికెట్ అంటే కేవలం క్రికెట్ ఆడటం ఒక్కటే కాదు ..మైదానంలో వాళ్ళు చేసే స్లెడ్జింగ్ ను తట్టుకొని నిలబడగలగాలి ..ప్రత్యర్థి ఆటగాళ్లను ఆటతో కాకుండా మాటలతో మానసికంగా దెబ్బ తీయడంలో ఆస్ట్రేలియన్లను మించిన వారు ప్రపంచ క్రికెట్లో ఎవరు లేరు ...ఇప్పుడంటే బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత మాటల యుద్ధం కొంచెం తగ్గింది గాని , ఒకప్పుడు ఉన్న ఆస్ట్రేలియా జట్టు అయితే ప్రత్యర్ధులు ఆ స్లెడ్జింగ్ కె భయపడేవారు ..

గత ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ నాయకథ్వములో ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు తొలిసారిగా టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది ..ఆ సిరీస్లో ఆస్ట్రేలియాను ఆటతోనే గాక మతాల యుద్ధంలోనూ ఓడగొట్టింది ..ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ , వికెట్ల వెనకాల రిషబ్ పంత్ ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఒక ఆట ఆడుకున్నారు ..కెప్టెన్ కోహ్లీ అయితే తన మీద ఎంత మాటల దాడి చేస్తే అతడు అంతలా రెచ్చిపోతాడు..ఈ విషయం ఆస్ట్రేలియన్లకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది .

అందుకే విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ చేసే సమయంలో తమ జట్టు ఆటగాళ్లెవరూ అతడిని కవ్వించే ప్రయత్నం చేయరని ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజెల్‌వుడ్‌ చెప్పాడు. అలా చేయడం వల్ల కోహ్లిలోని అత్యుత్తమ ఆట బయటకొస్తుందని అది మరింత ప్రమాదకరమని హాజెల్‌వుడ్‌ అన్నాడు. ‘కోహ్లిని రెచ్చగొట్టేందుకు మేం సాహసించం. అతని రెచ్చగొడితే ఏమవుతుందో 2018 సిరీస్‌లోనే మేం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. కోహ్లి కూడా ఆటలో పోటీని ఇష్టపడతాడు. ఇలాంటి సందర్భాల్లో అతను మరింతగా చెలరేగిపోతాడు. కోహ్లి బ్యాటింగ్‌ చేసే సమయంలో స్లెడ్జింగ్‌ జోలికే వెళ్లకూడదు. బౌలర్లెవరూ ఆ పని చేయకూడదు’ అని హాజెల్‌వుడ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :
|
|

Advertisement