Advertisement

  • చెన్నై జట్టు పై దూకుడు ప్రదర్శించిన జోస్ బట్లర్

చెన్నై జట్టు పై దూకుడు ప్రదర్శించిన జోస్ బట్లర్

By: chandrasekar Tue, 20 Oct 2020 09:23 AM

చెన్నై జట్టు పై దూకుడు ప్రదర్శించిన జోస్ బట్లర్


చైన్నై సూపర్ కింగ్స్ తో పోటీపడ్డ రాజస్థాన్ రాయల్స్ జట్టులో జోస్ బట్లర్ దూకుడు ప్రదర్శించి తమ జట్టు విజయానికి కారణమైనాడు. చెన్నైపై రాజస్థాన్ రాయల్ ఆటగాడు జోస్ బట్లర్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ వల్ల రాజస్థాన్ జట్టు రాయల్ గా విజయం సాధించింది. ఐపీఎల్ 2020లో 37వ మ్యాచు చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఇందులో చెన్నై టీమ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ టీమ్ సునాయాసంగా చేరుకోగలిగింది. స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్ జోడీ 97 పరుగులు సాధించడంతో ఈ విజయం వారికి సులువుగా సాధ్యం అయంది. తొలూత బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి దిగిన చెన్నై టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే సాధించగలిగింది.

చెన్నై స్కోర్ కార్డు చూస్తే రవీంద్ర జడేజా 30 బంతుల్లో 34 రన్స్, ఇందులో 4 ఫోర్లున్నాయి. శామ్ కరన్ 22 పరుుగుల చేశాడు 1 ఫోర్, 1 సిక్స్, మహేంద్ర సింగ్ ధోనీ 28 బంతుల్లో 28 పరుగులు 2 ఫోర్లు, డుప్లెసిన్ 10 రన్స్, వాట్సన్ 8 రన్స్, అంబటి రాయుడు 13 రన్స్ చేశారు. రాజస్థాన్ జట్టులో బౌలర్లు జోఫ్రా ఆర్చర్ 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయాగా, కార్తిక్ త్యాగి 35 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. శ్రేయాస్ గోపాల్ 14 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు అలాగే రాహుల్ తెవాటియా 18 రన్స్ ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. రాజస్థాన్ లక్ష్యం -126 పరుగులు కాగా స్టీవ్ స్మిత్ (26 పరుగులు, 2ఫోర్లు), జోస్ బట్లర్ (48 బంతుల్లో 70 పరుగులు 7ఫోర్లు, 2 సిక్సులు) చక్కని ఆటతీరు కనబర్చడంతో 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Tags :

Advertisement