Advertisement

  • ఐపీయల్ తో ఎందరో జీవితాలు ముడిపడి ఉన్నాయి ..జాంటీ రోడ్స్

ఐపీయల్ తో ఎందరో జీవితాలు ముడిపడి ఉన్నాయి ..జాంటీ రోడ్స్

By: Sankar Fri, 10 July 2020 11:13 AM

ఐపీయల్ తో ఎందరో జీవితాలు ముడిపడి ఉన్నాయి ..జాంటీ రోడ్స్



ఐపీయల్ ఎందరో ఆటగాళ్ల జీవితాలతో ముడిపడి ఉన్న టోర్నీ .ఎందరో యువ ఆటగాళ్లు ఐపీయల్ రాణించి ఇండియన్ టీంలో స్థానం సంపాదించాలని చూస్తున్నారు ..అలాగే హార్దిక్ పాండ్య , మహేంద్ర సింగ్ ధోని లాంటి స్టార్ ఆటగాళ్లు ఐపీయల్ రాణించి ఫామ్ నిరూపించుకోవాలి అని చూస్తున్నారు ..అయితే కరోనా కారణంగా ఐపీయల్ వాయిదా పడటంతో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి ..అయితే ఎలాగైనా ఈ ఏడాది ఐపీయల్ నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది ..

అయితే ఐపీఎల్ లేకుండా క్రికెట్ క్యాలెండర్‌ని ఊహించుకోవడం కష్టమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. ఎందరో యువ ఆటగాళ్లు ఐపీయల్ ఆడతారు ..ఆర్థికంగా వారికి ఈ ఐపీఎల్ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించాడు.ఐపీఎల్‌ క్రికెటర్లకి ఆర్థికంగా, భవిష్యత్‌ పరంగా చాలా ముఖ్యమైన టోర్నీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడతారు. అందుకే.. ఐపీఎల్‌ లేని క్రికెట్ క్యాలెండర్‌ అర్థం లేదని నా భావన. ఈ ఏడాది చివరికి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి.. ఐపీఎల్ జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని జాంటీ రోడ్స్ వెల్లడించాడు.

ఐపీఎల్ 2020 సీజన్ రద్దయితే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుండగా.. వందల మంది క్రికెటర్లకి కూడా రూ. కోట్లు చేజారనున్నాయి. ఇందులో భారత క్రికెటర్లే ఎక్కువ. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, పార్థీవ్ పటేల్ లాంటి క్రికెటర్లు కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతూ క్రికెట్‌లో కొనసాగుతున్నారు

Tags :
|
|

Advertisement