Advertisement

  • ఐసీసీ ర్యాంకింగ్స్ భారత ఆటగాళ్ల జోరు ..టాప్ టెన్ లో బెయిర్‌స్టో

ఐసీసీ ర్యాంకింగ్స్ భారత ఆటగాళ్ల జోరు ..టాప్ టెన్ లో బెయిర్‌స్టో

By: Sankar Thu, 17 Sept 2020 5:35 PM

ఐసీసీ ర్యాంకింగ్స్ భారత ఆటగాళ్ల జోరు ..టాప్ టెన్ లో  బెయిర్‌స్టో


ఐసీసీ వన్ డే ర్యాంకింగ్స్ లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ తమ తొలి రెండు స్థానాలను పదిలంగా కాపాడుకున్నారు..ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ నిన్న ముగియడంతో తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే చివరి మ్యాచ్ లో సెంచరీతో రాణించిన జానీ బెయిర్‌స్టో ఈ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు..

పాకిస్తాన్ బాట్స్మెన్ బాబర్ ఆజమ్ (829) తో మూడో స్థానం లో నిలవగా, 754 పాయింట్లతో బెయిర్‌స్టో 10వ స్థానంలో ఉన్నాడు. అదే మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు మాక్స్వెల్ 108 పరుగులు చేయగా, అలెక్స్ కారీ 106 పరుగులు చేశాడు. దాంతో బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో మాక్స్వెల్ 5 స్థానాలు ఎగబాకి ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్‌ తో కలిసి 26 వ స్థానంలో ఉండగా, 11 స్థానాలు పైకి వచ్చిన కారీ 28 వ స్థానంలో నిలిచాడు..

ఇక బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా బుమ్రా (719) రెండవ స్థానం లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ (701) మూడవ స్థానంలో ఉన్నారు. కాగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ దాదాపు రెండేళ్ళ తర్వాత తొలిసారిగా టాప్ 10 లోకి తిరిగి వచ్చాడు. అతను 15 నుండి 8 వ స్థానానికి వచ్చాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 18 స్థానాలు మెరుగుపరుచుకొని కెరీర్‌లో అత్యుత్తమంగా 10వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో 10 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 21వ స్థానానికి చేరుకున్నాడు.

ఆల్ రౌండర్స్ జాబితాలో టాప్ 10 లో చోటు దక్కించుకున్న ఏకైక భారత ఆటగాడు రవీంద్ర జడేజా. ఇందులో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మొహమ్మద్ నబీ (301) ఉండగా ఈ సిరీస్ లో 6 వికెట్లు పడగొట్టి 89 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ 2 వ స్థానంలో నిలిచాడు. ఇక జడేజా (246) పాయింట్లతో 8 వ స్థానానికి పరిమితమయ్యాడు

Tags :
|
|

Advertisement