Advertisement

  • ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా మాజీ స్టార్ ఆటగాడు

ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా మాజీ స్టార్ ఆటగాడు

By: Sankar Mon, 03 Aug 2020 6:43 PM

ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా మాజీ స్టార్ ఆటగాడు



పాకిస్థాన్​తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్​గా మాజీ బ్యాట్స్​మన్ జొనాథన్ ట్రాట్​ నియమితుడయ్యాడు. బుధవారం ఈ సిరీస్​ ప్రారంభం కానుంది. తన కెరీర్​లో ఇంగ్లండ్ తరఫున 52 టెస్టులు ఆడిన ట్రాట్​ 3835 పరుగుల చేశాడు. అలాగే 68వన్డేలు, 7టీ20లు ఆడాడు.

అయితే ఫస్ట్​ క్లాస్ క్రికెట్​లో 18,662 పరుగులు చేసి మంచి టెస్టు క్రికెటర్​గా పేరుతెచ్చున్నాడు. కాగా ఇంగ్లండ్​, పాకిస్థాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్ మాంచెస్టర్​ వేదికగా బుధవారం ప్రారంభం కానుంది.

కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే ఈ సిరీస్ జరుగనుంది. ఇటీవలే సొంతగడ్డపై టెస్టు సిరీస్​లో వెస్టిండీస్​ను 2-1తేడాతో ఓడించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మంచి ఫామ్​లో ఉంది.

Tags :
|

Advertisement