Advertisement

  • యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ లో గంటా 58 నిమిషాల్లోనే జయభేరి మోగించిన జొకో

యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ లో గంటా 58 నిమిషాల్లోనే జయభేరి మోగించిన జొకో

By: chandrasekar Wed, 02 Sept 2020 10:14 AM

యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ లో గంటా 58 నిమిషాల్లోనే జయభేరి మోగించిన జొకో


కరోనా వైరస్‌ భయం కారణంగా కొంతమంది టాప్‌ ప్లేయర్లు టోర్నీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఫేవరెట్‌గా బరిలో దిగిన జొకో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాడు. పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో జొకోవిచ్‌ 6-1, 6-4, 6-1తో దామిర్‌ జుముర్‌ పై సులువుగా విజయం సాధించాడు. ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో గంటా 58 నిమిషాల్లోనే జొకో జయభేరి మోగించాడు.

సెర్బియా స్టార్‌ 5 ఏస్‌లు సంధించగా జుముర్‌ రెండింటితోనే సరిపెట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో సిట్సిపస్‌ 6-2, 6-1, 6-1తో అల్బెర్ట్‌ రామోస్‌ పై గెలుపొందగా సుదీర్ఘంగా సాగిన పోరులో 16వ సీడ్‌ ఇస్నెర్‌ 7-6 (7/5), 3-6, 7-6 (7/5), 3-6, 6-7 (3/7)తో తన దేశానికే చెందిన స్టీవ్‌ జాన్సన్‌ చేతిలో ఓటమి చెందాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఎంజెలిక్‌ కెర్బర్‌, నవోమీ ఓసాకా తొలి రౌండ్‌లో గెలుపొంది ముందడుగేశారు.

అమెరికా యువ సంచలనం కొకో గాఫ్‌ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై౦ది. ప్లిస్కోవా 6-4, 6-0తో అనెహెలినా కలినినా పై.. కెర్బర్‌ 6-4, 6-4తో ఐలా టొమ్లియానోవిచ్‌ పై ఒసాకా 6-2, 5-7, 6-2తో తన దేశానికే చెందిన మిసాకిపై గెలుపొందారు. గతేడాది యూఎస్‌ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన గాఫ్‌ 3-6, 7-5, 4-6తో సెవస్తోవా చేతిలో ఓటమి పాలైంది.

Tags :
|
|

Advertisement