Advertisement

  • పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరండి... లక్షలు పొందండి

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరండి... లక్షలు పొందండి

By: chandrasekar Mon, 09 Nov 2020 3:47 PM

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరండి... లక్షలు పొందండి


పోస్టాఫీస్ పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో చేరడం వల్ల డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలాగే మంచి రాబడి కూడా సొంతం చేసుకోవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్స్‌లో రూ.100 నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ప్రతి నెలా డబ్బులు కడుతూ వెళ్లాలి. ఈ స్కీం‌లో కస్టమర్లు కట్టే డబ్బుపై మంచి రాబడి పొందొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన లాభం వస్తుంది. చిన్న మొత్తంలో డబ్బులు ఆదా చేసుకోవాలని భావించే వారికి ఈ స్కీమ్ ఉపయోగకరంగా ఉంటుంది.

మీరు కూడా రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లి అకౌంట్ తెరవాలి. ఐదేళ్ల కాల పరిమితితో రికరింగ్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. బ్యాంకుల్లో కూడా ఈ సదుపాయం ఉంది. ఆరు నెలల, ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఇలా మీకు నచ్చిన కాల పరిమితుల్లో ఆర్‌డీ అకౌంట్ తెరవొచ్చు. పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌లో కనీసం రూ.100 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీకు నచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఆర్‌డీ అకౌంట్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు మీ అకౌంట్‌కు వస్తాయి. ఉదాహరణకు మీరు పోస్టాఫీస్ ఆర్‌డీ అకౌంట్‌లో నెలకు రూ.3,000 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే రూ.5 లక్షలు పొందొచ్చు. దీని కోసం మీరు పదేళ్లపాటు ప్రతి రోజూ రూ.100 చొప్పున ఆదా చేసుకుంటూ నెల నెలా ఆర్‌డీ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తూ పోవాలి.

Tags :
|
|

Advertisement