Advertisement

  • కరోనా సమయంలో ఇంటికి వెళ్ళాడు ..మ్యాచ్ నుంచి తీసేసారు

కరోనా సమయంలో ఇంటికి వెళ్ళాడు ..మ్యాచ్ నుంచి తీసేసారు

By: Sankar Thu, 16 July 2020 6:03 PM

కరోనా సమయంలో ఇంటికి వెళ్ళాడు ..మ్యాచ్ నుంచి తీసేసారు



దాదాపు నాలుగు నెలల తర్వాత జరుగుతున్న క్రికెట్ సిరీస్ ..అందునా కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న దశలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకోని ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ను బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తుంది ..అయితే మాంచెస్టర్ వేదికగా ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. సౌథాంప్టన్ నుంచి అక్కడికి వచ్చే సమయంలో జోప్రా ఆర్చర్ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ని బ్రేక్ చేశాడు. దాంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడ్ని రెండో టెస్టు నుంచి తప్పించింది.

జోప్రా ఆర్చర్ చేసిన తప్పు ఏంటంటే..సౌథాంప్టన్ వేదికగా గత ఆదివారం తొలి టెస్టు మ్యాచ్ ముగియగా.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాంచెస్టర్‌కి ఇరు జట్ల ఆటగాళ్లు చేరుకున్నారు. కానీ.. మార్గమధ్యంలో జోప్రా ఆర్చర్ తన ప్లాట్‌కి వెళ్లి తిరిగి జట్టుతో చేరే ప్రయత్నం చేశాడు. దాంతో.. అతడి జీపీఎస్‌ని ట్రాక్ చేసిన అధికారులు అడ్డుకుని ఐదు రోజులు సెల్ఫ్ ఇసోలేషన్ ఉండాలని అతనికి సూచించారు. ఈ ఐదు రోజుల్లో రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని.. రెండింటిలోనూ నెగటివ్ వస్తేనే తిరిగి జట్టులో ఆర్చర్‌ని అనుమతించనున్నట్లు ఈసీబీ తెలిపింది. ఆ

అయితే నేను చేసింది తప్పే.. నన్ను క్షమించండి. నేను చేసిన పని కారణంగా నాతో పాటు టీమ్, మేనేజ్‌మెంట్‌ని కూడా ప్రమాదంలో పడేశాను. ఈ బయో-సెక్యూర్ వాతావరణంలో ఉండి సిరీస్‌‌లో భాగమైనవారందరికీ నా బహిరంగ క్షమాపణలు తెలియజేస్తున్నా’’ అని జోప్రా ఆర్చర్ వెల్లడించాడు. సౌథాంప్టన్, మాంచెస్టర్ స్టేడియాలు మాత్రమే హోటల్‌తో అనుబంధంగా ఉండటంతో.. ఈ వేదికల్లోనే ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య సిరీస్‌ని నిర్వహిస్తున్నారు.




Tags :

Advertisement