Advertisement

  • మూడో టెస్ట్ ముందు ఇంగ్లాండ్ కు ఊరట ..స్టార్ బౌలర్ ఆర్చర్ కు కరోనా నెగటివ్ ..

మూడో టెస్ట్ ముందు ఇంగ్లాండ్ కు ఊరట ..స్టార్ బౌలర్ ఆర్చర్ కు కరోనా నెగటివ్ ..

By: Sankar Wed, 22 July 2020 1:24 PM

మూడో టెస్ట్ ముందు ఇంగ్లాండ్ కు ఊరట ..స్టార్ బౌలర్ ఆర్చర్ కు కరోనా నెగటివ్ ..



బయో- సెక్యూర్ రూల్స్ బ్రేక్ చేసిన కారణంగా రెండో టెస్టుకి దూరమైన ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్.. ఇంగ్లాండ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐదు రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న ఆర్చర్‌కి రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. రెండు సార్లూ నెగటివ్ వచ్చింది. దాంతో.. అతను ఇంగ్లాండ్ జట్టుతో కలిసేందుకు మార్గం సుగుమమైంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య మూడో టెస్టు శుక్రవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది.

ఇప్పటికే తొలి రెండు టెస్టులు జరగగా మొదటి టెస్టులో , వెస్ట్ ఇండీస్ విజయం సాధిస్తే , రెండో టెస్టులో ఇంగ్లాండ్ సమం చేసింది ..అయితే ఆర్చర్ చేరికతో ఇంగ్లాండ్ బౌలింగ్ బలం పెరగనుంది ..అయితే సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగగా.. రెండో టెస్టు కోసం ఇరు జట్లు మాంచెస్టర్‌కి చేరుకున్నాయి.

ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు తమ సొంత కార్లలో సౌథాంప్టన్ నుంచి మాంచెస్టర్‌కి ప్రయాణించగా.. జోప్రా ఆర్చర్ మధ్యలో ఇంటికి వెళ్లి కాసేపు ఉండి వచ్చాడు. దాంతో.. అతను బయో-సెక్యూర్ రూల్స్‌ బ్రేక్ చేసినట్లు నిర్ధారించిన ఇంగ్లాండ్,వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడ్ని రెండో టెస్టు నుంచి తప్పించడమే కాకుండా ఐదు రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించింది..

Tags :
|
|

Advertisement