Advertisement

  • భారతీయ అమెరికన్ ఓట్లపై దృష్టి పెట్టిన జో బిడెన్ ..

భారతీయ అమెరికన్ ఓట్లపై దృష్టి పెట్టిన జో బిడెన్ ..

By: Sankar Tue, 21 July 2020 3:28 PM

భారతీయ అమెరికన్ ఓట్లపై దృష్టి పెట్టిన జో బిడెన్ ..



ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒకటి ..ప్రపంచం మొత్తానికి పెద్దన్నగా పిలవబడే అమెరికా యొక్క వైట్ హౌస్ లో అధ్యక్ష స్థానంలో కూర్చోవడం కంటే పెద్ద ప్రతిష్ట ఇంకోటి ఉండదు ..అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనగానే కేవలం అమెరికాలోనే గాక ప్రపంచ దేశాల్లో కూడా ఆసక్తి ఉంటుంది ..అయితే ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ..ఈ సారి కూడా ఒక వైపు డోనాల్డ్ ట్రంప్ రెండో సారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతుండగా, మరోవైపు జో బిడెన్ పోటీ పడుతున్నారు ..

అయితే ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి భారతీయ అమెరికన్ల ఓటర్లు ఎంతో ముఖ్యమని డెమొక్రాట్లు నమ్ముతున్నారు. గతంలో అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్‌లు డెమొక్రాట్లకు ఎక్కువగా ఓట్లు వేశారు. అలాగే ఈ సారి నవంబర్‌ 3న, జరిగే ఎన్నికల్లో వారు కీలక పాత్ర పోషిస్తారని, మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ జో బిడెన్‌ వైట్‌హౌస్‌లోకి వెళ్లడానికి మార్గం సుగమం అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీ చైర్మన్‌ టామ్‌ పెరెజ్‌ ఇటీవల ఒక వర్చువల్ టన్-హాల్‌లో మాట్లాడుతూ, భారతీయ అమెరికన్‌ ఓట్లు కచ్ఛితంగా ఫలితాలలో వ్యత్యాసాన్ని తీసుకురాగలవని చెప్పారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ మిచిగాన్, విస్కాన్సిన్ , పెన్సిల్వేనియా రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్‌కు తక్కువ మెజారిటీ లభించింది. ఆసియా అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులు, భారతీయ, చైనీస్, ఫిలిపినో, కొరియన్, జపనీస్ ఇండోనేషియా సంతతివారు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు.

యూనిటెడ్‌ స్టేట్స్‌లో 4 మిలియన్ల మంది భారతీయ అమెరికన్‌ ఓటర్లు ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది ఓటు వేయడానికి అర్హులు. ట్రంప్‌ను నిలువరించి బిడెన్‌ను గెలిపించడంలో ఈ ఓటర్ల కీలక పాత్ర పోషిస్తారని డెమొక్రాటిక్ గ్రూప్ ఏఏపీఐ విక్టరీ ఫండ్ విశ్లేషించింది. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో గెలవడానికి అమెరికన్‌ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement