Advertisement

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జో బైడెన్ ...

By: Sankar Tue, 22 Dec 2020 10:48 AM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జో బైడెన్ ...


అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ మాట నిలబెట్టుకున్నారు. ప్రజల మధ్యలో కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటాను అన్న బైడెన్‌ దాన్ని నిజం చేసి చూపారు.

బైడెన్‌ సోమవారం క్రిస్టియానాకేర్‌ ఆస్పత్రిలో బహిరంగంగా ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రజలు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా దాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇలా బహిరంగంగా వ్యాక్సిన్‌ తీసుకున్నాను’ అన్నారు.

క్రిస్టియానాకేర్ ఆసుపత్రిలో నర్సు ప్రాక్టీషనర్, ఎంప్లాయీ హెల్త్ సర్వీసెస్ హెడ్ తబే మాసా బైడెన్‌కి వ్యాక్సిన్‌ వేశారు. నూతన అధ్యక్షుడి భార్య డాక్టర్ జిల్ బిడెన్ ఇప్పటికే వ్యాక్సిన్ మొదటి కోర్సును తీసుకున్నారు. బైడెన్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వెళ్లగా ఆమె కూడా హాజరయ్యారు...

Tags :

Advertisement