Advertisement

  • డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై జో బైడెన్‌ ఆగ్రహం

డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై జో బైడెన్‌ ఆగ్రహం

By: chandrasekar Mon, 26 Oct 2020 1:15 PM

డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై జో బైడెన్‌ ఆగ్రహం


అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై జో బైడెన్‌ ఆగ్రహం తెలిపారు. భారత్‌లో వాయుకాలుష్యంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు భారతదేశాన్ని ‘మురికి’గా పిలిచారు. మీరు మన స్నేహితులతో మాట్లాడే తీరు ఇది కాదు. వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించే మార్గం కూడా ఇది కాదంటూ బైడెన్‌ ట్వీట్‌ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గత గురువారం నాష్‌విల్లేలో జరిగిన చివరి సంవాదంలో ట్రంప్‌ మాట్లాడారు. పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణాలు వెల్లడించిన ట్రంప్‌ త‌న నిర్ణయాన్ని స‌మ‌ర్థించుకున్నారు. చైనా దేశాన్ని గ‌మ‌నించండి, ఎంత రోత‌గా ఉందో ర‌ష్యాను చూడండి, ఇండియాను చూడండి ఆ దేశాల్లో వాయు నాణ్యత చెడిపోయిన‌ట్లు ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బైడెన్‌ స్పందిస్తూ నేను, కమలా హారిస్‌ భారత్‌తో అమెరికా భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నాం.

వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్లను సరిచేయడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా అమెరికా విదేశాంగ విధానాన్ని తిరిగి గౌరవప్రద స్థానంలో ఉంచుతామని స్పష్టం చేశారు. ఒబామా-బైడెన్‌ ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్‌-అమెరికా దేశాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాం. అదే తరహాలో బైడెన్‌-హారిస్‌ పాలనలో మరింత ఎక్కువ భాగస్వామ్యంతో ఇరుదేశాల సంబంధాలను కొనసాగిస్తామంటూ బైడెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వెస్ట్ వీక్లీ తాజా సంచికలో తన అభిప్రాయాన్ని రీట్వీట్ చేశాడు. అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌తో కలిసి నిలబడి, చైనాసహా మరే దేశం బెదిరింపులకు దిగకుండా శాంతి స్థాపనకు కలిసి పని చేస్తామన్నారు. తిరిగి మార్కెట్లను ప్రారంభించి, యూఎస్‌, భారత్‌లో మధ్య తరగతిని వృద్ధి చేయడంతో పాటు వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఉగ్రవాదం, అనువిస్తరణ తదితర సవాళ్లను కలిసి ఎదుర్కొంటామని జో బైడెన్‌ స్పష్టం చేశారు. భారత్ తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతామని తెలిపారు.

Tags :
|
|

Advertisement