Advertisement

ఉద్యోగం లేదా.. ఇలాంటోళ్లతో జర జాగ్రత్త ...

By: chandrasekar Mon, 17 Aug 2020 10:27 PM

ఉద్యోగం లేదా.. ఇలాంటోళ్లతో  జర జాగ్రత్త  ...


కోవిద్ మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న వేళ దేశంలో నిరుద్యోగ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. లాక్ డౌన్ వల్ల కొన్ని సంస్థలు ఆదాయ వనరులను కోల్పోయి ఉద్యోగులను కుదిస్తుండటం, మరికొందరు పలు కారణాల వల్ల ఉద్యోగాలను కోల్పోవడంతో నిరుద్యోగం మరింత పెరిగింది.

అయితే.. ఇలాంటి సంక్షోభంలో కూడా కొందరు నిరుద్యోగులను దోచుకునే దందాకు తెరలేపారు. జాబ్ నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులే వారి టార్గెట్. 'స్పెషల్ డిఫెన్స్ పర్సనల్ ఫోరమ్' పేరుతో ఆగస్ట్ 1న పలు పత్రికల్లో ఈ మాయగాళ్లు ఓ ఉద్యోగ నియామక ప్రకటన ఇచ్చారు.

నిరుద్యోగులు ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ అని నిరుద్యోగులను నమ్మబలికించేలా 'మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్', గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ శాఖను కూడా ప్రకటనలో వాడేశారు. అంతేకాదు, నిరుద్యోగుల్లో మరింత నమ్మకం కుదిరేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే జీతభత్యాలను కూడా అంతే నమ్మకంగా పొందుపరిచారు.

డిగ్రీ అయితే చాలు.. ఎలాంటి అనుభవం అవసరం లేదని కూడా ప్రకటనలో ఇవ్వడం గమనార్హం.ఇలాంటి ప్రకటనలు చూసి నిరుద్యోగులు మోసపోతున్నారు. పరీక్ష ఫీజుల రూపంలో ఇలాంటి మోసగాళ్లు డబ్బు దండుకుంటున్నారు. ఈ దందాను కొందరు ప్రజావేగులు(విజిల్ బ్లోయర్) వెలుగులోకి తెచ్చారు. ఇలాంటి కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, ఉద్యోగ నోటిఫికేషన్ ను చూసి దరఖాస్తు చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలని పోలీసులు నిరుద్యోగ యువతకు సూచిస్తున్నారు.

Tags :
|
|

Advertisement