Advertisement

యుకో బ్యాంక్ లో ఉద్యోగ అవకాశాలు

By: chandrasekar Mon, 26 Oct 2020 1:26 PM

యుకో బ్యాంక్ లో ఉద్యోగ అవకాశాలు


యుకో బ్యాంక్ లో ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కోల్‌క‌తా ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న భార‌త ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని యుకో బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 91 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్ కేడర్ స్కేల్-1, స్కేల్- 2 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటిలో సెక్యూరిటీ ఆఫీసర్, ఇంజనీర్, ఎకనమిస్ట్, ఐటీ ఆఫీసర్, సీఏ తదితర పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అక్టోబర్ 27 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు నవంబర్ 17 చివరి తేదీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ucobank.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. మొత్తం ఖాళీలు‌ సంఖ్య 91 ఇందులో సెక్యూరిటీ ఆఫీసర్స్‌ - 9, ఇంజనీర్స్‌ (సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్) - 08, ఎకనమిస్ట్‌ - 2, స్టాస్టియన్‌ - 2, ఐటీ ఆఫీసర్‌ - 20, CA/CFA (JMGS-I) - 25, CA/CFA (MMGS-II) - 25. ఇందుకుగాను పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో గ్రాడ్యుయేష‌న్‌, ఇంజినీరింగ్ డిగ్రీ (సివిల్‌/ ఎల‌క్ట్రిక‌ల్), బీఈ/ బీటెక్‌, సీఏ, ‌పీజీ (ఎక‌నామిక్స్‌/ స‌్టాటిస్టిక్స్‌), పీహెచ్‌డీ, బీఆర్క్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

ఈ ఉద్యోగాల కోసం రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. దీనికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ అక్టోబర్‌ 27, 2020 నుండి ప్రారంభం మరియు ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది నవంబర్‌ 17, 2020 మరియు దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1180. ఇందుకుగాను ఆన్‌లైన్ ఎగ్జామ్ ను 2020 డిసెంబర్ లేదా 2021 జనవరి లో నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాలుగా తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం. దరఖాస్తు చేసుకోవడానికి తొలుత https://www.ucobank.com/ ఓపెన్ చేయాలి. రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో కెరీర్స్ సెక్షన్‌లో రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్ పైన క్లిక్ చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి. మీరు దరఖాస్తు చేయాలనుకునే జాబ్ లింక్ పైన క్లిక్ చేయాలి. మీ పేరు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫామ్‌ను ప్రింట్‌ తీసి భద్రపరుచుకోవాలి.

Tags :
|
|
|

Advertisement