Advertisement

కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఉద్యోగ అవకాశాలు

By: chandrasekar Tue, 29 Sept 2020 09:32 AM

కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఉద్యోగ అవకాశాలు


కొచ్చిన్ షిప్ యార్డ్ లో 10వ తరగతి మరియు ఐటీఐ పాస్ అయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నోటిఫికేషన్ జారీ చేయబడింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లో వివిధ రంగాల్లో వర్క్ మెన్ పదవుల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. భారత ప్రభుత్వ సంస్థ అయిన మినీరత్న కంపెనీ కోచిన్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ లో జారీ అయిన నోటిఫికేషన్ లో భాగంగా అప్లై చేసుకోడానికి అక్టోబర్ 10, 2020 చివరి తేదీ. దీని కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ కంపెనీలో మొత్తం 577 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయబడింది.

ఇందు కోసం ఉద్యోగానికి అప్లై చేయాల్సిన అభ్యర్థులు 4వ, 7వ తరగతి, మెట్రిక్ లేదా సమాన విద్యార్హతతో పాటు సంబంధిత అంశాల్లో ఐటీఐ-ఎన్ టీసి, వీటితో పాటు అభ్యర్థుల వద్ద తప్పనిరిగా ఫోర్ట్ లిఫ్ట్, క్రేన్ ఆపరేటర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ పదవులకు అప్లై చేయాల్సిన అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అక్టోబర్ 1, 2020 నాటి వరకు ఉన్న వయసు ఆధారంగా గుర్తించబడుతుంది. రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అభ్యర్థుల వయసులో మినహాయింపులు ఉంటాయి. ఉద్యోగానికి ఎంపిక అయిన అభ్యర్థులకు రూ.22,100 నుంచి 24,800 వరకు జీతం ఇవ్వనున్నారు. దీనిపై మరిన్ని వివరాల కోసం https://cochinshipyard.com/ పోర్టల్ ను వెబ్ పేజీలో చూడాలని తెలిపారు.

Tags :
|

Advertisement