Advertisement

  • సిలబస్ తగ్గించకూడదని నిర్ణయించినట్లు తెలిపిన జేఎన్టీయూ...

సిలబస్ తగ్గించకూడదని నిర్ణయించినట్లు తెలిపిన జేఎన్టీయూ...

By: chandrasekar Wed, 04 Nov 2020 6:59 PM

సిలబస్ తగ్గించకూడదని నిర్ణయించినట్లు తెలిపిన జేఎన్టీయూ...


కరోనా మహమ్మారి వల్ల 2020-21 జూన్‌లో విద్యా సంవత్సరం మొదలు కావాల్సి ఉండగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దేశమంతా అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో స్కూల్స్, పాఠశాలలు, విద్యాసంస్థలు మరలా ప్రారంభంకానున్నాయి.

ఈ నేపథ్యంలో విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా 2020-21 సంవత్సరానికి సిలబస్ తగ్గిస్తారని పలు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా జేఎన్టీయూహెచ్ స్పందించింది. ఇంజినీరింగ్ 2020-21 సంవత్సరానికి గాను సిలబస్ తగ్గించకూడదని నిర్ణయించినట్లు జేఎన్టీయూ తెలిపింది.

సిలబస్ కుదించకుండా పూర్తిస్థాయిలో బోధిస్తూనే విద్యా సంవత్సరం పూర్తి చేయాలని భావిస్తున్నది. దీని కోసం సమ్మర్, ఇతర సెలవులను తగ్గించాలని యోచిస్తున్నది. కాగా, డిసెంబర్ 1వ తేదీ నుంచి బీటెక్ తరగతులను ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నది.

Tags :
|

Advertisement