Advertisement

  • ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

By: Sankar Sat, 29 Aug 2020 4:54 PM

ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 30  వరకు లాక్ డౌన్ పొడిగింపు


క‌రోనా క‌ట్ట‌డి నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగించాల‌ని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణ‌యించింది. తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు ఎలాంటి నిషేదం విధించ‌లేదు. క్రీడ‌లు, వినోదం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, ఊరేగింపులు వంటి వాటికి అనుమ‌తి ఉండ‌దు. ఈ మేర‌కు సీఎం హేమంత్ సోరెన్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటిస్తూ ప్ర‌భుత్వ నియ‌మాల‌ను పాటించాల‌ని కోరారు.

ఇప్ప‌టికే విద్యాసంస్థలు, కోచింగ్ సెంట‌ర్లు స్విమ్మింగ్ పూల్స్ వంటి ప్ర‌దేశాల్లో అనుమ‌తి లేదు. అయితే అన్‌లాక్‌3లో భాగంగా జిమ్ సెంట‌ర్లు, యోగా కేంద్రాల‌కు సైతం ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిన సంగ‌తి తెల‌సిందే. ఈ నేప‌థ్యంలో జార్ఖండ్ రాష్ర్టంలో క్ర‌మంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లోనే 1365 కొత్త క‌రోనా కేసులు వెలుగ‌చూడ‌గా మొత్తం న‌మోదైన కేసులు 34,676కు చేర‌గా 378 మంది మ‌ర‌ణించారు. రాష్ర్టంలో అంత‌కంత‌కూ పెరుగుతున్న కేసుల నేప‌థ్యంలో తాజా నిబంధ‌న‌లు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి

Tags :

Advertisement