Advertisement

  • జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 11న వెల్లడయ్యే అవకాశం

జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 11న వెల్లడయ్యే అవకాశం

By: chandrasekar Thu, 10 Sept 2020 09:07 AM

జేఈఈ  మెయిన్ ఫలితాలు ఈ నెల 11న వెల్లడయ్యే అవకాశం


కరోనా కారణంగా వాయిదా పడ్డ జేఈఈ మెయిన్ పరీక్షలు ఈ నెల మొదటి వారంలో నిర్వహించడంతో వాటి ఫలితాలు అతి త్వరలోనే వెలువడనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఇటీవల జేఈఈ మెయిన్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ బుధవారం శుభవార్త చెప్పారు. ఫలితాల ప్రకటన ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే ప్రకటించనున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు.

ఇప్పుడు నిర్వహించిన పరీక్షలకుగాను ప్రభుత్వంపై నమ్మకం ఉంచినందుకు, జేఈఈ మెయిన్‌ పరీక్షలో పాల్గొన్నందుకు విద్యార్థులు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఫలితాలు త్వరలో ప్రకటించబడుతాయి. అని ట్వీట్‌ చేశారు. ఫలితాలు ప్రకటించిన వెంటనే అభ్యర్థులు తమ స్కోర్‌ను jeemain.nta.nic.in ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

సెప్టెంబర్ మొదటి వారంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జేఈఈ మెయిన్‌ 2020 పరీక్షలను కొవిడ్‌ మార్గదర్శకాలతో నిర్వహించిన విషయం తెలిసిందే. సుమారు 8లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ నెల 11న ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేశంలో కరోనా వైరస్‌ సంక్రమణ క్రమంలో ప్రవేశ పరీక్షను సురక్షితంగా నిర్వహించినందుకు ఎన్‌టీఏ, ఆయా రాష్ట్రాలు, అధికారులకు కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఎన్‌టీఏ తన అధికారిక వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్స్‌ 2020 కీని సైతం విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈ నెల 10వ తేదీలోగా తెలుపాలని సూచించింది. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Tags :

Advertisement