Advertisement

రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

By: Sankar Sun, 04 Oct 2020 10:10 PM

రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు


జాయింట్ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు అక్టోబర్ 5 న విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం పరీక్షను ఐఐటీ ఢిల్లీ నిర్వహించింది. ఇండోర్‌లోని 15 పరీక్షా కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా వెయ్యి కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1.60 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

అక్టోబర్ 6 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం విద్యార్థులు కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు అథారిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ఈ సంవత్సరం ఏడుకు బదులుగా ఆరు కౌన్సెలింగ్ రౌండ్లు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు దాదాపు 1.60 లక్షల మంది సెప్టెంబర్ 27 న అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరయ్యారు.

కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా 96 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. జవాబు కీ సెప్టెంబర్ 29 న విడుదల చేశారు. అభ్యంతరాలను లేవనెత్తడానికి చివరి తేదీ అక్టోబర్ 1 వరకు ఉన్నది. మాక్ టెస్ట్ కేటాయింపు అక్టోబర్ 12 నుంచి ప్రారంభమవుతుంది. జోసా కౌన్సెలింగ్ కోసం ఎంపికలను పూరించడానికి చివరి తేదీ అక్టోబర్ 15 గా ఉన్నది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపులు అక్టోబర్ 17 నుంచి మొదలవుతాయి.

Tags :

Advertisement