Advertisement

  • బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ 7వ సారి ప్రమాణ స్వీకారం

బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ 7వ సారి ప్రమాణ స్వీకారం

By: chandrasekar Mon, 16 Nov 2020 8:48 PM

బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ 7వ సారి ప్రమాణ స్వీకారం


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ముఖ్యమంత్రిగా రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కు ఇది వరుసగా నాలుగోసారి. మొత్తంగా ఇది ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 15 ఏళ్లుగా బిహార్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న నితీష్, తాజాగా జరిగిన ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముందుగా చెప్పినట్లుగానే నితీష్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుని మాట నిలబెట్టుకున్నారు. బీజేపీకి చెందిన రేణు దేవి, థార్ కిషోర్‌లు బిహార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బిహార్ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా థార్ కిషోర్, శాసనసభాపక్ష ఉప నేతగా రేణు దేవిని ఇప్పటికే ఎన్నుకన్నారు.

ఈ రోజు ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం స్వీకారం చేసిన అనంతరమే రేణు దేవి, థార్ కిషోర్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. నవంబర్ 10న వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి స్వల్ప మెజారిటితో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఎక్కువ స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ స్థానాలను అందుకోలేకపోయింది. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 స్థానాలు కావాలి. కాగా, ఎన్డీయే 125 స్థానాలు గెలచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేసుకుంది. వీరు గెలుపొందడంతో ఈ రోజు ముఖ్య మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు.

Tags :
|

Advertisement