Advertisement

  • తన కోరిక నెరవేరకుండానే మరణించిన జయ ప్రకాష్ రెడ్డి

తన కోరిక నెరవేరకుండానే మరణించిన జయ ప్రకాష్ రెడ్డి

By: chandrasekar Wed, 09 Sept 2020 09:37 AM

తన కోరిక నెరవేరకుండానే మరణించిన జయ ప్రకాష్ రెడ్డి


జయ ప్రకాష్ రెడ్డి తన కోరిక నెరవేరకుండానే మరణించిన విషయం తెలిస్తే చాలా బాధేస్తుంది. ప్రముఖ సీనియర్ నటుడు జయ ప్రకాష్ రెడ్డి మరణం ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నట్లుండి గుండెపోటుతో ఈయన మరణించడాన్ని సినిమా ఇండస్ట్రీ వాళ్లు కూడా తట్టుకోలేకపోతున్నారు. సినీ రంగంలో చాల మందికి ఆయన ఫేవరెట్ కారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన కోసమే సినిమాలలో పాత్రలు సృష్టించే డైరెక్టర్లు కూడా ఉన్నారు. మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరులో కూడా కొడితే కూజా చెంబు అయిపోతాది అంటూ ఈయన చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇదిలా ఉంటే ఈయన జీవితంలో 300 సినిమాలకు పైగానే నటించినా ఒక్క కోరిక మాత్రం తీరకుండానే వెళ్లిపోయాడు.

జయ ప్రకాష్ రెడ్డి గారు ఒక సినిమాలో హీరోగా నటించారు. ఈయన హీరోగా నటించిన అలెగ్జాండర్ సినిమా అంటే చాలా యిష్టం. తన సొంత నిర్మాణ సంస్థలోనే తనే నిర్మాతగా ఈ సినిమాను జయ ప్రకాష్ రెడ్డి చేసాడు. సీనియర్ దర్శకుడు ధవళ సత్యం దీన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా అంతా ఒక్కడే ఉంటాడు. 1 గంట 40 నిమిషాల పాటు సాగే ఈ డ్రామాలో ఏకపాత్రాభినయం చేసాడు జయ ప్రకాష్ రెడ్డి. ఈ సినిమాను చాలా యిష్టపడి మరియు కష్టపడి ఈయన చేసాడు. అయితే ఇది రిలీజ్‌కు నోచుకోకపోవడం గమనార్హం. ఇదే విషయంపై లాక్‌డౌన్‌కు ముందు ఈయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు.

అయన హీరోగా నటించిన ఈ సినిమాను విడుదల చేయమని అడిగితే జేపీ గాడి సినిమా ఎవడు చూస్తాడంటూ హేళనగా మాట్లాడారంటూ ఎమోషనల్ అయ్యాడు జయ ప్రకాష్ రెడ్డి. థియేటర్స్‌లో కాకపోయినా కనీసం ఓటిటిలో అయినా తన సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని ఆయన కోరుకున్నాడు. కానీ అది నెరవేరకుండానే ఈయన వెళ్లిపోవడం విషాదం. జయ ప్రకాష్ రెడ్డి ఇప్పుడు భౌతికంగా లేరు మరి ఆయన సినిమా అయినా వస్తుందో లేదో వేచి చూడాలి మరి. ఈయన గారు నటించిన విలన్ పాత్రలు అభిమానులను మరింతగా ఆకట్టు కున్నది.


Tags :

Advertisement